*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో జూన్21*//:ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని శనివారం స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో యోగాసనాలతో జోష్ నిండింది. పాఠశాల చిన్నారులు పలు రకాల యోగాసనాలు చేస్తూ అందరిని అబ్బురపరిచారు. 12 రకాల సూర్య నమస్కారాల భంగిమలు చేస్తూ చిన్నారులు
ఆకట్టుకున్నారు. ఉచ్వాస నిస్వాసలతో ప్రాణాయామం , ముద్రలు, ధ్యానం నిర్వహించిన చిన్నారులు పాఠశాల ఆవరణంలో ఉత్సాహంగా గడిపారు. యోగా దినోత్సవం ప్రాముఖ్యతను వివరిస్తూ పాఠశాల కరస్పాండెంట్
చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ విశ్వం అంతటికి మన దేశం అందించిన గొప్ప బహుమానం యోగా అని తెలిపారు. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు. యోగాసనాలతో శారీరక దృఢత్వం, ప్రాణాయామం, ధ్యానంతో మానసిక ఉత్సాహం పెరిగి నిత్య ఆరోగ్యాన్ని కలిగి ఉంటామని తెలియజేశారు. తమ పాఠశాల చిన్నారులు ఆనందోత్సవాలతో యోగాసనాలు చేయడం వారికి యోగ పట్ల ఉన్న ఉత్సాహాన్ని తెలియజేస్తున్నదని తెలిపారు. ప్రపంచంలో 200 దేశాలలో యోగా దినోత్సవం నిర్వహించడం ద్వారా మన దేశ ఖ్యాతి ఇనుమడింప చేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, పాఠశాల ప్రిన్సిపాల్ , ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.





C.E.O
Cell – 9866017966
