*జననేత్రం న్యూస్ హుజరాబాద్ ప్రతినిధి జూన్ 20*//:PDSU *కరపత్రాలు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆవిష్కరించడం జరిగింది హుజురాబాద్ డివిజన్ కార్యదర్శి మామిడి అరవింద్* మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో జూలై 12,13 తేదీలల్లో నిర్వహించే రాజకీయ శిక్షణ తరగతులకు రాష్ట్ర నలుమూలల నుండి విద్యార్థి నాయకత్వం హాజరవుతున్నది ,బోధించడానికి ప్రొఫెసర్ లు,మేధావులు వస్తున్నారు కరీంనగర్ జిల్లా ప్రగతిశీల శక్తులు, ఉద్యమ సానుభూతి పరులు,శ్రేయోభిలాషులు విజయవంతంకై కృషి చెయ్యాలని కోరారు.
ఈ క్లాసులల్లో ప్రధానంగా ప్రజల మధ్య ఏర్పడిన ఆర్ధిక అసమానతలు,ఉచిత విద్య,వైద్యం పట్ల పాలకవర్గాల నిర్లక్ష్యం వంటి అంశాలను చర్చించి ఉద్యమాలకు సన్నద్ధం అవుతాం అని మాట్లాడారు.
అలాగే రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని నియమించకుండా విద్యారంగ సమస్యలను పరిష్కరించకుండా మాటలకే పరిమితం అవుతున్నాడు,పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లు,ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చెయ్యకుండా చేతులు ఎత్తేయడం దుర్మార్గమైనది ఈ విద్యాసంవత్సరంలో మొత్తం బకాయిలు విడుదల చెయ్యకపోతే విద్యార్థి ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు నాయకులు, చరణ్, వంశీ, రోహిత్, మాధవి, సంధ్య, సంజన, టీనా,తదితరులు పాల్గొన్నారు.


C.E.O
Cell – 9866017966
