*జననేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో జూన్ 20*//:భద్రాచలంలో అక్రమ కట్టడాలైన ఐదంతస్తులు ఆరంతస్తులకి పర్మిషన్ ఎవరిస్తున్నారు?
గ్రామపంచాయతీ ద్వారా నివాసం ఉండటానికి మాత్రమే మూడంతస్తుల వరకు పర్మిషన్ ఇస్తారా లేక వ్యాపార సముదాయాలకు ఇస్తారా?
అక్రమ కట్టడాలైన ఆరంతస్తులు,ఐదంతస్తులకు భూగర్భ గనుల శాఖ నుంచి అనుమతులు ఉన్నాయా?
ఐదంతస్తులు, ఆరంతస్తులు నిర్మిస్తున్న అక్రమ నిర్మాణదారులు వారి యొక్క భూమి 5 అంతస్తులు ఆరంతస్తులు నిర్మించిన నిర్మాణం కూలిపోతుందో లేదో తెలుసుకోవటానికి కనీసం భూసార పరీక్షలు చేపిస్తున్నారా లేదా?
అక్రమ కట్టడా నిర్మాణదారులకు రెండంతస్తులు మూడంతస్తులు నిర్మాణం జరుగుతున్నప్పుడు గ్రామపంచాయతీ నుంచి ఇది అక్రమ నిర్మాణం అని నోటీసులు ఇచ్చి ఆ తర్వాత ఐదోతస్తులు, ఆరంతస్తులు నిర్మాణం జరిగే వరకు ఎందుకు పట్టించుకోవట్లేదు?
అక్రమంగా నిర్మిస్తున్న ఆరంతస్తులు, ఐదంతస్తుల బహుళ నిర్మాణాలకు ప్రభుత్వ ఇంజనీర్లు వద్ద నుంచి అప్రూవల్ లు ఉన్నాయా లేవా?
భద్రాచలం పట్టణంలో అక్రమంగా నిర్మించిన ఆరంతస్తుల భవనం కూలిపోయిన తరువాత కూడా ఇంకా ఆరంతస్తుల భవనాలు ఎలా నిర్మాణాలు జరుగుతున్నాయి?
భద్రాచలం పట్టణంలో పంచాయతీ పరిధిలో ఉన్న నీటి బావులను ఆక్రమించుకున్న పట్టించుకోరా?
భద్రాచలం పట్టణంలో జాతీయ రహదారికి సంబంధించిన భూములను ఆక్రమించుకొని షాపింగ్ కాంప్లెక్స్ కట్టిన పట్టించుకోరా?
పంచాయతీ స్థలాలలో కరెంటు ట్రాన్స్ఫారం లను నిర్మించిన పట్టించుకోరా?
పంచాయతీ వారు వేసిన బోరింగులను ఆక్రమించుకొని ఆ బోరింగ్ లను తొలగించిన వారిపై చర్యలు తీసుకోరా?
విఐపి రోడ్ అగ్నిమాపక శాఖ కార్యాలయం ముందు గిరిజనులకు సంబంధించిన భూములను కొని అక్రమంగా ఆరు అంతస్తుల భవనాలు నిర్మించిన వారిపై చర్యలు తీసుకోరా?
స్థానిక ఉదయ భాస్కర్ థియేటర్ ఎదురుగా యూబి రోడ్ లో దళితుల భూములను కొనుగోలు చేసి బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు చేసిన వారిపై చర్యలు ఉండవా?
ఇటువంటి అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు చేసినా, ప్రశ్నించినా వారిపై అక్రమ కేసులు బనాయిస్తారా?
కోట్లాది రూపాయలతో అక్రమంగా బహుళ అంతస్తుల భవనాలు జరుగుతా ఉంటే ఆదాయ పన్ను శాఖ అధికారులకు తెలిసి జరుగుతుందా? తెలియకుండా జరుగుతుందా?
ఆదాయ పన్ను శాఖ అధికారులు ఎందుకని రైడ్ చేయడం లేదు?
భద్రాచలంలో ఇన్ని అవినీతి అక్రమాలు జరుగుతా ఉంటే ఏసీబీ అధికారులు పట్టించుకోరా?
ముద్దా పిచ్చయ్య
దళిత సంక్షేమ సంఘం.


C.E.O
Cell – 9866017966
