*నిబంధనలను పాటించని ప్రైవేట్ పాఠశ యాజమాన్యాలపై చర్యలు చేపట్టాలి..
*జిల్లా ఉన్నత అధికారులకు సామాజిక కార్యకర్త , న్యాయవాది కర్నె రవి వినతి
భద్రాద్రి కొత్తగుడెం జిల్లా బ్యూరోజూన్17*//:మణుగూరు ఏజెన్సీ ఏరియాలోని మణుగూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో కొనసాగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని సామాజిక కార్యకర్త , న్యాయవాది కర్నె రవి డిమాండ్ చేశారు . సోమవారం ఈమెరకు ఆయన జిల్లా ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయని మణుగూరు పట్టణంతోపాటు సబ్ డివిజన్ లో విద్యాహ క్కు చట్టం పాటించకుండా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి కార్పొరేట్, ప్రైవేటు వద్యాసంస్థలు నిబంధనలకు విరుద్దంగా విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఫీజు వివరాలను నోటిసు బోర్డులో అతికించి అందరికీ తెలియజేసే విధంగా ఉండాల్సి ఉండగా ఏ ఒక్క పాఠశాలో కూడా పాటించ
డంలేదన్నారు. అలాగే గుర్తింపు లేని ప్రైవేటు కార్పొరేట్ పాఠశాల
లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి విద్యను వ్యాపారమయం చేశా
రన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘంచి విద్యా చట్టాన్ని అమలు చేయకుండా ఇష్టా
రాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తూ లాభార్జనే తమ ధ్యేయంగా ప్రైవేట్ విద్యావ్యవస్థ కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పుస్తకా
లు, దుస్తులు కూడా విద్యాసంస్థ
ల్లో పెట్టి వ్యాపారం కొనసాగిస్తుంటే విద్యాధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గుర్తింపులేని ప్రైవేటు విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
.అలాగే భీనామీ పేర్లతో మెడికల్
షాపును నిర్వహిస్తున్న యజమా
నులు సదరు దుకాణంలో మందు
లను విక్రయించడంతో పాటు పెద్ద ఎత్తున ప్రైవేట్ పాఠశాలలకు చెందిన నోట్ పుస్తకాలు, పాఠ్యపు
స్తకాలను విక్రయిస్తూ దోపిడీకి తెర లేపారని ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్కు
ఫిర్యాదు చేశామని తెలిపారు. తక్షణమే ఆ దుకాణం లైసెన్స్ ను
ప్రిజ్ చేయాలన్నారు. అలాగే ప్రైవేట్ పాఠశాల దోపిడీపై తక్షణమే చర్యలను కోరుతూ
జిల్లా కలెక్టర్, ఐ.టి.డి.ఏ. ప్రాజెక్ట్ ఆఫీసర్, జిల్లా విద్యాశాఖ అధికారి,పోలిస్ స్టేషన్ SHO,
జిల్లా సేల్స్ ట్యాక్స్ అధికారి, కమర్షియల్స్ ట్యాక్స్ అధికారి ని
స్వయంగా కలసి పిర్యాదు చేసామని రవి పేర్కొన్నారు.
కార్పొరేట్, ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మోసం చేస్తూ అడ్మిషన్ల పేరుతో దోపిడీకి గురి చేస్తున్నాయన్నారు. అనేకసార్లు అధికారుల దష్టికి తీసుకెళ్లినా కూడా జిల్లా విద్యాశాఖ అధికారి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి వెంటనే స్పందించి మండల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చి పాఠ్య పుస్తకాలు యూనిఫారం వ్యాపారం చేస్తున్న విద్యా సంస్థలను సీజ్ చేయాలని తెలిపారు. కార్పొరేట్, ప్రయివేట్ పాఠశాలలు అర్హత పరీక్ష పేరుతో అడ్మిషన్లు నిర్వహిస్తూ వ్యాపారం ముసుగులో యూనిఫామ్, పాఠ్య
పుస్తకాలు వేలాది రూపాయలు విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి దోచుకుంటున్నారని అన్నారు. పలు కార్పొరేట్ ప్రయివేట్ పాఠశాలలు గుర్తింపు లేకుండా కొనసాగుతున్నా పట్టించుకోలేదని మండి పడ్డారు. ఇప్పటి కైనా జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉన్నత అధికారులు స్పందించి ప్రైవేట్ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ఫీజులను నియంత్రించాలని, ఈ మేరకు ఆయా మండల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని లేకపోతే మరింత ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.




C.E.O
Cell – 9866017966
