జననేత్రం న్యూస్ సంగారెడ్డి జిల్లా బ్యూరో జూన్16*//:టీ వై జె ఎఫ్ఐ జహీరాబాద్ అధ్యక్షులు అనిల్ కుమార్ సంగారెడ్డి జహీరాబాద్
నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థల్లో నూటికి నూరు శాతం ఫీజు రాయితీని కల్పించాలని ( టీ వై జె ఎఫ్) తెలంగాణ యూత్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు తనుగుల జితేందర్ రావు, ఆదేశాల మేరకు జహీరాబాద్ అధ్యక్షులు అనిల్ కుమార్, ఉపాధ్యక్షుడు నగేష్, ఆధ్వర్యంలో సోమవారం నాడు సంగారెడ్డిలో డిఈఓ వెంకటేశ్వర్లు ను కలిసి వినతి పత్రం సమర్పించారు. టీ వై జె ఎఫ్ జహీరాబాద్ అధ్యక్షులు అనిల్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి తమ సంఘం పాటుపడుతుందని వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం జర్నలిస్టులు నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో చాలామంది జర్నలిస్టులు తమ కుటుంబాన్ని కూడా పట్టించుకోవడంలేదని అన్నారు పేద మధ్యతరగతి వర్గాల వారే ఎక్కువమంది జర్నలిస్టులు ఉన్నారని చెప్పారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో వారి పిల్లలకు ఫీజు రాయితీ కల్పించడం ద్వారా ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు.
