*జననేత్రం న్యూస్ మహబూబాద్ జిల్లా బ్యూరో జూన్15*//:వేంకటేశ్వరస్వామి గుట్ట,శనిగపురం శనిగపురం గ్రామంలో ఊరంతా వనబోజనాలకు తరలివెళ్లారు. వేట వెంకటేశ్వరునిగా ప్రసిద్ధి చెందిన స్వామివారికి మొక్కులు చెల్లించుకొని తమ భక్తిప్రవత్తులు చాటుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శంతన్ రామరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా శంతన్ రామరాజు మాట్లాడుతూ శ్రీదేవి భూదేవి సతీసమేతంగా స్వామివారు గుట్టపై వెలిశారన్నారు. ప్రతియేటా మృగశిరకార్తె మొదటి లేక రెండో శనివారం గ్రామస్తులంతా కలిసి వనబోజన మహోత్సవం అంగరంగవైభవంగా నిర్వహిస్తారన్నాడు. భక్తుల కొంగుబంగారంగా కోరిన కోర్కెలు తీర్చే దైవంగా మానుకోట ప్రజలు కొలుస్తారని అన్నాడు. తొలకరిజల్లులు కురిసే శుభ సందర్భంలో కులమతాలకు అతీతంగా గ్రామ ప్రజలంతా కలసికట్టుగా స్వామి వారిని దర్శించుకుంటారని అన్నాడు. గుట్టపై సహజసిద్ధంగా వెలసిన కోనేరు ఎంతటి కరువుకాటకాలు వచ్చినా నీరు నిలిచి ఉంటుందని ఇదంతా స్వామివారి మహిమగా పేర్కొన్నాడు. గ్రామ ప్రజలే కాకుండా చుట్టుప్రక్కల జిల్లాలనుండి కూడా భక్తులు హాజరవుతారని అన్నాడు.
ఇంకా ఈకార్యక్రమంలో మానుకోట ధర్మసమాజ్ బాద్యులు ధార ఇందు భారతి, సీనియర్ జర్నలిస్టులు మహ్మద్ సుభాని, గొర్రె చిట్టిబాబు, చిర్రగోని ఉదయ్ ధీర్, సాగర్ రామరాజు, గ్రామస్తులు వేల్పుల లక్ష్మణ్, గుగులోత్ రాములు నాయక్, ఉపేందర్ రామరాజు, ధరంసోత్ నారాయణ్ సింగ్, గంగాధరి బాలరాజు, చుక్క శ్రీనివాస్, తోట వెంకన్న, తోట సురేష్, అల్వాల లాలయ్య, కోలా సత్యం, వేల్పుల శోభన్ బాబు, కొండి సాయికిరణ్ నేత, మోహనచారి, కూన బుచ్చయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
