*జననేత్రం న్యూస్.జంగారెడ్డిగూడెం ప్రతినిధి జూన్11//:జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్రవ్యాప్త నిరసనలో భాగంగా జంగారెడ్డిగూడెం, ఆర్ డి వో, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ల ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో బుధవారం జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రదర్శన నిర్వహించారు.
మా ఈ డిమాండ్స్ ను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు.
*డిమాండ్స్*
జర్నలిస్టులకు ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా పెన్షన్ సౌకర్యం మన రాష్ట్రంలో కూడా కల్పించాలి. అక్రిటిడేషన్ కమిటీలో ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ డి జె ఏ లకు స్థానం కల్పించాలి. జర్నలిస్టులపై జరిగే దాడులనుఅరికట్టేందుకు వీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీలలో ఫెడరేషన్ కు సభ్యత్వం కల్పించాలి. మీడియా అకాడమీని బలోపేతం చేసి నిధులు మంజూరు చేయాలి. జర్నలిస్టులకు సమాచార శాఖ ఆధ్వర్యంలో గతంలో మాదిరిగా అవార్డులు ఏర్పాటు చేయాలి. జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత కల్పించాలి.. జర్నలిస్ట్ లను అక్రమంగా తొలగిస్తున్న యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కార్మిక శాఖను బలో పేతం చేయాలి, అదేవిధంగా అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు కల్పిస్తున్న భీమా పథకం జర్నలిస్టులకు కూడా వర్తింప చేయాలి. ప్రస్తుతం జర్నలిస్టులకు అమలు అవుతున్న ఆరోగ్య బీమా పథకం మార్చాలి.ప్రభుత్వమే రెన్యూవల్ చెయ్యాలి అదేవిధంగా సీనియర్ జర్నలిస్టులకు వారి స్థితిగతులను బట్టి వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయాలి. ఈ నిరసన కార్యక్రమంలోసంఘం రాష్ట్ర కార్యదర్శి కె ఎస్ శంకర్రావు,
స్టేట్ కౌన్సిల్ మెంబర్ కే బాలశౌరి, జంగారెడ్డిగూడెం
డివిజన్ అధ్యక్షులు గొల్లమందల శ్రీనివాసరావు, కార్యదర్శి పి ఎన్ వి రామారావు, ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులు కే. రవి కిరణ్, జిల్లా జాయింట్ సెక్రెటరీ కలపాల శ్రీనివాసరావు, సంఘ సభ్యులు సిహెచ్ కుమారస్వామి, గరువు బాబూరావు, నక్కా శ్రీనివాసరావు, నూజివీడు కిషోర్ బాబు, ఉప్పల కృష్ణ, ఎల్ వెంకట్, అద్దేటి వెంకటేశ్వరరావు, తదితర సభ్యులు పాల్గొన్నారు.


C.E.O
Cell – 9866017966
