*జననేత్రం న్యూస్ మాక్తల్నియోజకవర్గం ప్రతినిధి జూన్09*//:మాక్తల్ ఎమ్మెల్యే ముదిరాజ్ ముద్దుబిడ్డ వాకిటి శ్రీహరి కి మంత్రి పదవి ఇచ్చిన శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు
తొలిసారి గెలిచిన ఆ ముదిరాజ్ ఎమ్మెల్యే వాకిటి శ్రీ హరి ఆశలు ఫలించాయి. ఇన్నాళ్లు ఊరించిన ఆ మంత్రి పదవి ఎట్టకేలకు వరించింది.సామాజిక సమీకరణాలు కూర్పు నాటి సర్పంచ్‌ను కేబినెట్ మంత్రి వరించింది.ఏది ఏమైనా ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కడంతో ముదిరాజ్ సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా *తెలంగాణ రాష్ట్రం బీసీ కార్యదర్శి జి విజయ్ కుమార్* మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి కేబినెట్ బర్త్ వరించిందనీ రాష్ట్రంలోనే బలమైన ముదిరాజ్ సామాజికవర్గం నుంచి గెలిచిన వాకిటి శ్రీహరి.. తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ముదిరాజ్ సామాజికవర్గం తెలంగాణ రాష్ట్ర బీసీ నుంచి గెలిచిన ఒక్కగానొక్క ఎమ్మెల్యే కావడం ఆయనకు వరంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా బీసీల్లో ముదిరాజ్ సామాజికవర్గం చాలా బలంగా ఉంది.


C.E.O
Cell – 9866017966
