*జననేత్రం న్యూస్ అమీన్పూర్ మున్సిపాలిటీ ప్రతినిధిజూన్08*//:అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పటేల్ గూడా ప్రాంతంలోని పలు కాలనీలను సందర్శించిన బీఆర్ఎస్ యువనాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ కాలనీవాసులతో ముచ్చటిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు
గత పాలకుల అవినీతి వల్ల పటేల్ గూడాలో కాలనీల పరిస్థితి చాలా దయనీయంగా మారిందని, అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని పేర్కొన్నారు.
సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, మిషన్ భగీరథ వాటర్ పేర్లతో కాలనీవాసుల దగ్గర అక్రమంగా డబ్బులు వసూలు చేయడం అనేది చాలా దుర్మార్గమని అన్నారు. ఇకపై ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దని, 50-50 రేషియో వంటి అవకతవక పద్ధతులను పూర్తిగా నిరాకరించాలని సూచించారు.
ప్రజలు తమ స్వంత డబ్బుతో అభివృద్ధి పనులు చేసుకుంటే ప్రజాప్రతినిధులు, పాలకులు పని చేయాల్సిన అవసరం ఏముంది? ప్రజలు ఓట్లు ఎవరికివ్వాలి? ఎందుకివ్వాలి? అనే ప్రశ్నను వినిపించాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
కాలనీవాసులందరూ అప్రమత్తంగా ఉండాలని, ఏ సమస్య వచ్చినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. సహకారం, పారదర్శకతతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది అని అన్నారు


C.E.O
Cell – 9866017966
