*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో మే11*//: ఈ రైడింగ్ ఉదయం 7:00 గంటలకు ఖమ్మం లకారం ట్యాంక్‌బండ్ నుండి ప్రారంభమై, వెలుగుమట్ల అర్బన్ పార్క్ వరకు (మొత్తం 10 కిలోమీటర్లు) సాగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలీస్ కమిషనర్ శ్రీ సునీల్ దత్ గారు, IPS, మరియు జిల్లా అటవీ అధికారి శ్రీ సిద్ధార్థ విక్రమ్ సింగ్ గారు, IFS పాల్గొన్నారు. అలాగే FDO మంజుల గారు, ఖమ్మం FRO నాగేశ్వరరావు గారు, ఖమ్మం రేంజ్, డివిజన్ సిబ్బంది, డాక్టర్లు, ఎమ్మార్వోలు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు, సామాజిక కార్యకర్తలు, పర్యావరణ కార్యకర్తలు తదితరులు విస్తృతంగా పాల్గొన్నారు.
ఈ రైడింగ్ లో “A Bowl of Water – Save Wings” అనే నినాదంతో వేసవి కాలంలో పక్షులకు నీటిని అందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో నిర్వహించబడింది.
అలాగే సేవ్ ఫారెస్ట్ – సేవ్ నేషన్, సేవ్ వాటర్ – సేవ్ ప్లాంట్ వంటి పర్యావరణ సంబంధిత సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయబడింది.
సైకిల్ రైడర్స్ స్వయంగా మట్టి గిన్నెలు కొనుగోలు చేసి, వాటిని పక్షులకు నీరు అందించేందుకు అటవీశాఖ సిబ్బందికి అందజేశారు. పాల్గొన్న ప్రతి సైకిల్ రైడర్‌కు ప్రశంసాపత్రాలు (సర్టిఫికెట్లు) అందజేయబడ్డాయి.
అంతేకాకుండా, ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థుల కోసం వన విజ్ఞాన సమ్మర్ క్యాంప్ మే 6 నుండి 11 వరకు నిర్వహించబడింది. ఈ క్యాంపులో ట్రెక్కింగ్, మొక్కల పెంపకం, పర్యావరణ అవగాహన, సైక్లింగ్, యోగా వంటి కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. విద్యార్థులందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. క్యాంప్‌లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి సర్టిఫికెట్లు కూడా అందజేయబడ్డాయి.




C.E.O
Cell – 9866017966
