Home Latest News కార్పొరేట్సెలూన్లనుమూసివేయాలి.నాయి బ్రాహ్మణుల కు రుణాలురాయితీలుకల్పించాలికులవృత్తులను కాపాడాలి.నాయి బ్రాహ్మణుల కు పేటెంట్ హక్కులు కల్పించాలి*.నాయిబ్రాహ్మణులప్రదర్శనఅంబేద్కర్ కు వినతి పత్రం వినూత్నంగా కటింగ్ చేస్తూ నిరసన.అసిస్టెంట్కలెక్టర్కువినతిపత్రం.ధర్నా చౌక్ లో సభ.

కార్పొరేట్సెలూన్లనుమూసివేయాలి.నాయి బ్రాహ్మణుల కు రుణాలురాయితీలుకల్పించాలికులవృత్తులను కాపాడాలి.నాయి బ్రాహ్మణుల కు పేటెంట్ హక్కులు కల్పించాలి*.నాయిబ్రాహ్మణులప్రదర్శనఅంబేద్కర్ కు వినతి పత్రం వినూత్నంగా కటింగ్ చేస్తూ నిరసన.అసిస్టెంట్కలెక్టర్కువినతిపత్రం.ధర్నా చౌక్ లో సభ.

by Jananethram News
0 comments

న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో మే05*//: తమ జీవనోపాధిని దెబ్బతీస్తున్న కార్పొరేట్ సెలూన్లను వెంటనే మూసివేయాలని , నాయి బ్రాహ్మణుల ను వృతి భివృద్ధి పరంగా రుణాలు , రాయితీలనుఅందజేయాలని , దెబ్బతింటున్నవృత్తులను కాపాడాలని కోరుతూ ఖమ్మం నగరంలో సోమవారం నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఐక్యవేదిక నగర కమిటీ ఆధ్వర్యంలో   ర్యాలీని నిర్వహించి , ధర్నా చౌక్ లో నిరసన సభ తలపెట్టారు . అంతకుముందు పెవెలియన్ గ్రౌండ్ నుండి జిల్లా పరిషత్ సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించి , డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు . ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణులు కార్పొరేట్ సెలూన్ ల వ్యవస్థకు వ్యతిరేకంగా కటింగ్ చేస్తూ వినూత్న నిరసన ప్రకటించారు . అనంతరం ధర్నా చౌక్ లో జరిగిన నిరసన సభ ఆ సంఘం ప్రధాన కార్యదర్శి గుండ్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. తొలుత సంఘం అధ్యక్షులు ఎలమందల జగదీష్ నాయి మాట్లాడారు. వేలాది మంది నాయి బ్రాహ్మణులు శతాబ్దాల నుండి కులవృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారని , కార్పొరేట్ సెలూన్ల కారణంగా వారి జీవనోపాధి కోల్పోయే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. నాయి బ్రాహ్మణుల కులవృత్తి పై వారికే పేటెంట్ హక్కు కల్పించి , ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. అదేవిధంగా వృత్తిదారులకు రుణాలు , రాయితీలు కల్పించాలి , పదిలక్షల రూపాయల మేరకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బడా పెట్టుబడి దారులు , కార్పొరేట్ సంస్థలు ఏర్పాటు చేస్తున్న సెలూన్ లను మూసి వేసేవరకు పోరాటం ఆగదని తెలిపారు. ధర్నాకు సిపిఐ , టిఆర్ఎస్ , బిజెపి , ప్రజా పంథా  మాస్ లైన్ వంటి పార్టీలతోపాటు వివిధ కుల ప్రజా సంఘాల బాధ్యులు పాల్గొని , మద్దతు ప్రకటించారు. బిజెపి నుండి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణుల న్యాయమైన డిమాండ్లకు తమ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని అన్నారు. వారి కులవృత్తిపై వారికే పేటెంట్ హక్కు ఉండే విధంగా తమ పార్టీ కృషి చేస్తుందని హామీని ఇచ్చారు. టిఆర్ఎస్ నాయకుడు మురళీకృష్ణ మాట్లాడుతూ మేడిన్ ఇండియా , మేకింగ్ ఇండియా అంటూ నినాదాలు ఇచ్చే పాలకులు నాయి బ్రాహ్మణుల కులవృత్తి దెబ్బ తినకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. నాయి బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి తమ వంతు మద్దతు , సహకారం ఉంటుందన్నారు. సిపిఐ నాయకుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్పొరేట్ వ్యవస్థ సకల కుల వృత్తులను దెబ్బతీస్తుందని , కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా సంఘటిత పోరాటాలు చేయాలని తెలిపారు. ప్రజా పంథా మాస్ లైన్ జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణుల న్యాయమైన డిమాండ్లకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఏ సమయములోనైనా  సంఘీభావం ప్రకటించడానికి సిద్ధంగా ఉంటామన్నారు. చాకలి ఎస్సీ సాధన కమిటీ అధ్యక్షురాలు  కొత్ కుండ్ల శ్రీలక్ష్మి  మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు మరి ఎలాంటి వృత్తి పన్నులు లేని కారణంగానే అగ్రవర్ణాలు సైతం నాయి బ్రాహ్మణ కులవృత్తిపై దృష్టి సారించి , కార్పొరేట్ స్థాయి సెలూన్లను ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. కార్పొరేట్ సెలూన్లను మూసివేయాలి అంటే మనం ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కులవృత్తుల ఫెడరేషన్లకు నిధులు ఇచ్చి ఆయన వృత్తులపై ఆధారపడ్డ నిరుపేద వర్గాలను ఆదుకోవాలని కోరారు. ముదిరాజ్ మహాసభ  జిల్లా అధ్యక్షులు రావుల హనుమంతరావు ముదిరాజ్ మాట్లాడుతూ పార్టీలకతీతంగా నాయి బ్రాహ్మణులు సమస్యల సాధన కోసం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. బూర్జువా పార్టీలు , బూర్జువ సంఘాలు మన సమస్యలు పరిష్కరించవని గమనించాలన్నారు. లంబాడి హక్కుల పోరాట సమితి _ నంగారా బేరి రాష్ట్ర ఉపాధ్యక్షులు బానోతు బద్రు నాయక్ మాట్లాడుతూ ప్రపంచీకరణ నేపథ్యంలో నేపథ్యంలో అన్ని రకాల కుల వృత్తులు దెబ్బ తిన్నాయని , మిగిలిన వృత్తుల పరిరక్షణకు కుల ప్రజా సంఘాలతో పాటు ప్రతి ఒక్కరూ సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు. మహబూబాబాద్ కు  చెందిన నాయి బ్రాహ్మణ సంఘం నాయకుడు డాక్టర్ దయానంద్ మాట్లాడుతూ దిశా నిర్దేశం చేసే ఖమ్మం నుండి ఇలాంటి ఉద్యమం మొదలుకావటం అభినందనీయమని , దీనిని రాష్ట్రస్థాయిలో విస్తరింప చేయాల్సిన అవసరం ఉందన్నారు. తొలుత నాయి  బ్రాహ్మణుల కులదైవం ధన్వంతరి కి  పూలమాలలు వేసి , ప్రార్ధన చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అసిస్టెంట్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి నాయి బ్రాహ్మణుల డిమాండ్ల తో రూపొందించిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీలు , ఆయా సంఘాల నాయకులు డాక్టర్ శీలం పాపారావు , సన్నే ఉదయ ప్రతాప్ , ఆవుల అశోక్ , సామాజికవేత్త కొత్తపల్లి రవి ( హైదరాబాద్ ) జిల్లా నాయకులు నగర నాయకులు మండల నాయకులు సంఘ సభ్యులు , తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird