*జననేత్రంన్యూస్.నిర్మల్ల్ జిల్లా ప్రతినిధి మే 01*//:ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్త కుల గణన చేపడతానని నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమని సారంగాపూర్ మండల బిజెపి అధ్యక్షులు కాల్వ నరేష్ అన్నారు. మండల బిజెపి శాఖ ఆధ్వర్యంలో గురువారం సారంగాపూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సందర్భంగా వారు మాట్లాడారు. స్వాతంత్రం వచ్చినప్పటినుండి కాంగ్రెస్ సర్కార్ కులగణన చేపట్టలేదని, ప్రస్తుతం కుల, జనగణనతో బీసీలకు, అణ గారిన వర్గాల వారికి న్యాయం జరుగుతుందన్నారు. ప్రధాని మోదీ చేపడుతున్న నిర్ణయాలతో పేద ప్రజలకు ఎంతో న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల సీనియర్ నాయకులు చంద్రప్రకాష్ గౌడ్ సాహెబ్ రావు, విలాస్,చెన్న రాజేశ్వర్,వీరయ్య, సాగర్ రెడ్డి,నారాయణ,భూమా రెడ్డి,సాధు రామ్ రెడ్డి,తిరుమల చారి, రంజిత్,శేఖర్, నవీన్ యాదవ్,లింగ రెడ్డి, రమణయ్య,లక్ష్మణ్,భీమా లింగం, మహేష్ రెడ్డి,నర్సయ్య,నారాయణ, నారాయణ రెడ్డి, భూమేష్,మహేష్,శివరాం,సురేష్, గోకుల్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.



C.E.O
Cell – 9866017966
