Home Uncategorized ఆర్టీసీ కార్మికవర్గ ఐక్యత,శ్రేయస్సే ఎస్ డబ్ల్యూ ఎఫ్ ధ్యేయం

ఆర్టీసీ కార్మికవర్గ ఐక్యత,శ్రేయస్సే ఎస్ డబ్ల్యూ ఎఫ్ ధ్యేయం

by Jananethram News
0 comments

*మేడే స్ఫూర్తితో మే 20న జాతీయ సమ్మెను జయప్రదం చేద్దాం

*ఎస్ డబ్ల్యు ఎఫ్ ఉప ప్రధాన కార్యదర్శి గడ్డం లింగమూర్తి పిలుపు

*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో మే0*1//: ఆర్టీసీ కార్మికుల ఐక్యత వారి శ్రేయస్సే ధ్యేయంగా ఎస్ డబ్ల్యూ ఎఫ్ పనిచేస్తుందని ఆర్టీసీ కార్మిక వర్గానికి నష్టం కలిగించే వైఖరులను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోమని,మే 20వ తేదీన జాతీయ కార్మిక సంఘాల పిలుపుమేరకు జరగనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దామని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(సిఐటియు అనుబంధం) రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి గడ్డం లింగమూర్తి పిలుపునిచ్చారు.
గురువారం ఉదయం ఖమ్మం లోని సిహెచ్.వి.రామయ్య స్మారక భవనం వద్ద పగిళ్లపల్లి నరసింహారావు అధ్యక్షతన ఏర్పాటైన మేడే కార్యక్రమంలో గడ్డం లింగమూర్తి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఎస్ డబ్ల్యూ ఎఫ్ సీనియర్ సభ్యులు మిర్యాల వెంకటేశ్వర్లు శ్వేతారుణ మేడే పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా “జోహార్ చికాగో అమరవీరులకు జోహార్ జోహార్,మేడే వర్థిల్లాలి,ప్రపంచ కార్మికులారా ఏకంకండి,కార్మిక ఐక్యత వర్ధిల్లాలి” అంటూ కార్యకర్తలు నినదించారు.ఈ సందర్భంగా లింగమూర్తి ప్రసంగిస్తూ, భారత కార్మిక వర్గానికి ఎంతో కొంతమేరకు ప్రయోజనకరంగా ఉన్న 44 కార్మిక చట్టాలను కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లుగా రూపొందించడాన్ని నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు మే 20వ తారీఖున జరగబోయే జాతీయ సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీ కార్మికులందరూ మేడే స్ఫూర్తితో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికులను 55 రోజులపాటు సమ్మె చేయించి ఇబ్బందుల పాలు చేసిన గత కేసిఆర్ ప్రభుత్వం ఓడిపోవాలని ఆర్టీసీ కార్మిక వర్గం మొత్తం కోరుకున్నారని,ఆర్టీసీ కార్మిక వర్గం ప్రజలు కోరుకున్న విధంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని,ఆర్టీసీలో కార్మిక సంఘాలను పునరుద్ధరించాలని ఆర్టీసీ కార్మికు రావలసిన అన్ని రకాల వేతన బకాయిలను చెల్లించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.విద్యుత్ బస్సుల పథకంలో సవరణలు చేసి ఆర్టీసీ సంస్థ నిర్వహించుకునే విధంగా విద్యుత్ బస్సులను ఆర్టీసీలకే అప్పగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
డిపో కమిటీ కార్యదర్శి గుగ్గిళ్ళ రోశయ్య వందన సమర్పణతో ముగిసిన ఈ కార్యక్రమంలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రంశెట్టి వెంకటేశ్వర్లు రీజియన్ కార్యదర్శి పిట్టల సుధాకర్,ప్రచార కార్యదర్శి తోకల బాబు,డిపో కమిటీ నాయకులు బుగ్గవీటి లింగమూర్తి,ఆర్ఇఎన్ కుమార్,జి బాబు,ఉమా,మణి రిటైర్డ్ ఉద్యోగ సంఘం నాయకులు బిజిబి చారి,రంగా రామారావు,ఆకుతోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird