*భూ భారతి చట్టం రెవెన్యూ సదస్సులపై పైలెట్ మండలాల జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీసీఎల్ కమీషనర్
*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరోఏప్రిల్30*//:రెవెన్యూ సదస్సులలో వచ్చిన ప్రతి భూ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిసిఎల్ఏ కమీషనర్ నవీన్ మిట్టల్ అన్నారు.
బుధవారం హైదరాబాద్ నుంచి సిసిఎల్ఏ కమీషనర్, భూ భారతి చట్టం రెవెన్యూ సదస్సులపై పైలెట్ మండలాలు ఉన్న 4 జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ డివిజన్ అధికారులు, తహసిల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిసిఎల్ఏ కమీషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ భూ భారతి చట్టం అమలులో భాగంగా ముందస్తుగా 4 పైలెట్ మండలాలను ఎంపిక చేసుకొని, రెవెన్యూ సదస్సులను నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించామని అన్నారు.
పైలట్ మండలాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లకు సూచించారు. సాధా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించి పూర్తి చేయాలని అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ నేలకొండపల్లి మండలంలో ఉన్న 23 రెవెన్యూ గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించామని తెలిపారు. సర్వే నెంబర్ సమస్యలు, విస్తీర్ణ సమస్యలు, సాదా బైనామ దరఖాస్తులు మొదలగు వివిధ రకాల భూ సమస్యలపై దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రభుత్వం అందించిన మార్గదర్శకాలు, భూ భారతి చట్టం రూల్స్ ప్రకారం దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్డీఓ నరసింహా రావు, ఎస్.డి.సి. ఎం. రాజేశ్వరి, నేలకొండపల్లి తహసీల్దార్ వెంకటేశ్వర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.





C.E.O
Cell – 9866017966
