*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ఏప్రిల్30*//:కాంగ్రెస్.పార్టీమండలనాయకులు మానుకొండ రాధా కిషోర్ మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ వాంకడోత్ దిపక్ నాయక్ రఘునాథపాలెంరైతులను రాజుగా చూడటమే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మానకొండ రాధా కిషోర్, కన్వీనర్ వాంకడోత్ దీపక్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రఘునాథపాలెం మండల వ్యాప్తంగా ఉన్న చెరువులను సాగర్ జలాలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు కృషి చేశారని వారు అభినందించారు. ఎండాకాలంలో చెరువులో చుక్క నీరు లేకుండా ఉండేవి అని గుర్తు చేశారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీ నేతలకు ఎవరికి రాని లిఫ్ట్ ఇరిగేషన్ ఆలోచన మంత్రివర్యులకి రావటం విశేషం అన్నారు. ఆయన ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం రఘునాథపాలెం మండలానికి సాగర్ జలాలు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తామని ఆనాడు చెప్పిన మాట ప్రకారం చేసి చూపించార న్నారు. గతంలో అధికారంలో ఉన్న రాజకీయ నాయకులకు రాని ఆలోచన మంత్రివర్యులు వచ్చిందని పైపులైన్ ద్వారా నీరు అందించరన్నారు. అనంతరం పైపులైన్ ద్వారా బావోజి తండా చెరువులో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని విడుదల చేశారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, తుమ్మల నాగేశ్వరావు, చిత్రపటానికి నాయకులు పాలాభిషేకం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, మరియు రఘురాం, ప్రసాద్, మాలోత్ రాము, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామస్తులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

