*మూగ జీవాలతో పాటు ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సును కాపాడటంలో పశువైద్యుల పాత్ర కీలకం.
*ప్రపంచ పశువైద్య దినోత్సవంలో పాల్గొని, రక్త దానం చేసిన జిల్లా కలెక్టర్.l.
*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ఏప్రిల్26*//:పశు పాలకులకు మార్గదర్శకులుగా, మూగ జీవాల పాలిట ప్రాణ దాతలుగా, జీవవైవిధ్యంలో కీలక పాత్ర పోషించే పశువైద్యుల సేవ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే నని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం స్థానిక డిపిఆర్సీ భవనంలో ఏర్పాటుచేసిన ప్రపంచ పశువైద్య దినోత్సవంలో జిల్లా కలెక్టర్ పాల్గొని, అక్కడ ఏర్పాటుచేసిన రక్త దాన శిబిరంలో కలెక్టర్ రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మానవాళికి ప్రత్యక్షంగా ఉపయోగపడే పశువుల ఆరోగ్యానికి పశువైద్యులు, పశువైద్య శాస్త్రవేత్తలు అందిస్తున్న బహుళసేవలను మననం చేసుకునేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో చివరి శనివారాన్ని ప్రపంచ పశువైద్య దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు.
మన దేశంలో గ్రామీణ ప్రజల ముఖ్య జీవనాధారం వ్యవసాయమని, దీంతోపాటు పశుపోషణ వారి మనుగడలో కీలకమైనదని అన్నారు. వ్యవసాయంతో పాటు, వ్యవసాయ ఆధారిత పనులు చేసే సాంప్రదాయం మన దేశంలో ఉండేదని, వ్యవసాయంలో వాతావరణం, ఇతర ప్రతికూల పరిస్థితుల్లో నష్టం వస్తే రైతులు, పశుపోషణ, అనుబంధ రంగాలతో నిలద్రోక్కుకునే వారని తెలిపారు. బ్రిటిష్ వారు వచ్చాక, వాణిజ్య వ్యవసాయం వైపు మొగ్గుజూపి, స్థానిక వ్యవసాయాన్ని నాశనం చేసి, సాంప్రదాయం మెల్ల మెల్లగా తగ్గుతూ వచ్చిందని అన్నారు.
ఆహార భద్రతను నిర్ధారించడం, జూనోటిక్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా నిరోధించడం, జంతువుల ఆరోగ్యం, శ్రేయస్సు ను ప్రోత్సహించడంలో పశువైద్య నిపుణుల గొప్ప బాధ్యతను గుర్తించడం కోసం ఈ రోజు వేదికగా ఉంటుందన్నారు. పశువైద్యులు చేసే పని ఎంత ముఖ్యమో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
సమాజాన్ని పశుసంవర్ధక శాఖ కాపాడుతుందని కలెక్టర్ తెలిపారు. సమాజంలో ఉన్న మూగజీవాలపై పశువైద్యులు చూపే దయ, కరుణ, మిగతా వారిలో ఉంటే, గొడవలు, కోపాలు సమాజంలో వుండేవి కావన్నారు. వ్యవసాయం, సమాజాన్ని ఆడుకునే శాఖకు రైతుల తరఫున కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.
పశుసంవర్ధక శాఖను ఆడుకునే బాధ్యత జిల్లా యంత్రాంగం పై ఉందని, గ్రామీణ పశుకేంద్రాల్లో టాయిలెట్ల నిర్మాణం చేస్తామని, కావాల్సిన పరికరాలను అందజేస్తామని కలెక్టర్ అన్నారు. సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ప్రపంచంలో వ్యవసాయం సబ్సిడీలపై ఆధారపడివున్నదని, వ్యవసాయ అనుబంధ రంగాలకు మన దేశంలో ఊతం ఇచ్చి, అభివృద్ధి పరిస్తే, ప్రపంచంలో వ్యవసాయంతో అభివృద్ధి చెందిన దేశంగా మన దేశం నిలుస్తుందని కలెక్టర్ అన్నారు.
కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక అధికారి డా. కె. వెంకటనారాయణ, జిల్లాలో పశుసంవర్ధక శాఖ పరిస్థితి, చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.
ప్రపంచ పశువైద్య దినోత్సవం పురస్కరించుకుని పశువైద్యులు ప్రతిజ్ఞ చేశారు. అంతకుముందు జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రదాడి కి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ప్రపంచ పశువైద్య దినోత్సవం పురస్కరించుకొని చేపట్టిన రక్తదాన శిబిరంలో పశువైద్యులతో పాటు, జిల్లా కలెక్టర్ కూడా రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా. వెంకటేశ్వర్లు, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి డా. పురంధర్, పశువైద్య శాఖ సహాయ సంచాలకులు డా. శ్రీరమణి, రాష్ట్ర పశువైద్యుల సంఘం అధ్యక్షులు డా. రమేష్ బాబు, పశువైద్య అధికారుల సంఘం అధ్యక్షులు డా. శ్రీనివాస శెట్టి, ఏడి లు డా. కిషోర్, డా. ప్రదీప్, డా. ఉపేందర్, డా. రాజా, వెటర్నరీ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, ఖమ్మం కార్యాలయంచే జారీచేయనైనది.






C.E.O
Cell – 9866017966
