*జననేత్రం న్యూస్ నిర్మల్ జిల్లాప్రతినిధిఏప్రిల్25*//: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలకేంద్రంలో అడేల్లి మహా పోచమ్మ ఆలయ నూతన చైర్మెన్ గా సింగం భోజాగౌడ్ ప్రభుత్వం నియమించింది. భోజ గౌడ్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఆలయ చైర్మన్ గా నీయమించినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి, డీసీసీ అధ్యక్షులకు, జెడ్పిటిసిల జిల్లా ఫోరం అధ్యక్షుడు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి కి తోటి నాయకులకు మరియు సారంగాపూర్, ఆడేల్లి గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే ఆలయ అభివృద్ధికి తోడ్పడతానాని, ఆలయానికి వచ్చే భక్తులుకు ఎలాంటి ఇబ్బందులు కలగాకుండా చూస్తానని చెప్పారు.ఈ మేరకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ నుంచి ఉత్తర్వులు వెల్లడించినట్లు ఆ శాఖ సహాయ కమిషనర్ నవీన్ కుమార్ తెలిపారు.నూతన ధర్మ కర్తలు 11 మంది సభ్యుల తో కూడిన సింగం భోజాగౌడ్ శుక్రవారం నాడు ఉదయం11 గంటల 25 నిమిషాలకు ప్రమాణస్వీకారం చెశారు.సభ్యులు రొడ్డ మారుతి,కటికంటి లక్షమ్మి, మెదరి దర్శనం లస్మన్న, బ్యాగారి చిన్న సాయన్న,బట్టు భోజన్న, మగ్గడి రత్నాకర్,రసం జగత్ ప్రసాద్, సురకుంట వెంకటరమణారెడ్డి, ముస్సుకు నర్సారెడ్డి,గాజర్ల ప్రభాకర్ గౌడ్ తో పాటు ఎక్స్ ఆఫీషియే సభ్యుడిగా ఆలయా అర్చకుడు శ్రీనివాస్ శర్మ తో మండలి ఏర్పాటు చేస్తున్నట్టు ఏసి చెప్పారు. చైర్మన్ మరియు ధర్మకర్త సభ్యులకు అలయ అధికారులుచే ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్ధుల్ అది మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొల్లోజి నర్సయ్య , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, దశరథ రాజేశ్వర్ , కాంగ్రెస్ కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.




C.E.O
Cell – 9866017966
