*జననేత్రంన్యూస్ఉమ్మడిఖమ్మంజిల్లాబ్యూరోఏప్రిల్19*//:రఘునాథపాలెం మండలం మంచుకొండ గ్రామంలో రైతు బజార్ నిర్మాణానికి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అదనపు సదుపాయ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల*
రఘునాథ పాలెం మండలంలో కూరగాయలు పండించుకునే రైతులకు లాభం చేకూర్చేలా మూడు నెలల్లో రైతు బజార్ నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
శనివారం రఘునాథపాలెం మండలం మంచుకొండ గ్రామంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సింజెంటా కంపెనీ కార్పోరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్) క్రింద నిర్మిస్తున్న రైతు బజార్ పనులకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అదనపు సదుపాయాల కల్పన పనులకు శనివారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ, రైతుల ప్రోత్సాహంతో సింజెంటా కంపెనీ అంతర్జాతీయ కంపెనీగా ఎదిగిందని, కార్పోరేట్ సామాజిక బాధ్యత క్రింద రైతులకు అవసరమైన పనులు చేసేందుకు ముందుకు వచ్చారని మంత్రి తెలిపారు.
రఘునాథపాలెం మండలంలో పేద, గిరిజన రైతులు కూరగాయలు పండించుకుని అమ్ముకుంటున్నారని, వారికోసం చిన్న రైతు బజార్ ఏర్పాటు చేస్తే రైతులకు, వినియోగదారులకు లాభం జరుగుతుందని అన్నారు. 3 నెలల్లో రైతు బజార్ నిర్మాణ పనులు పూర్తి చేస్తారని వీటిని సక్రమంగావినియోగించుకోవాలని మంత్రి తెలిపారు.
మండలంలో వేరే ప్రాంతాలలో పండించే రైతులు కూడా అవసరమైతే కూరగాయలు చెడిపోకుండా, ఖమ్మంకు తరలించేలా అదనపు వసతులు కల్పిస్తామని అన్నారు. ఖమ్మం నుండి తాజా కూరగాయలు మంచుకొండ రైతుబజార్ కు వచ్చి కొనుక్కునేలా పేరు తెచ్చుకోవాలని తెలిపారు. మండలంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.
అంతకుముందు మంచుకొండ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అవసరమైన అదనపు సదుపాయ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, జెడ్పి సిఇఓ దీక్షా రైనా, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. బి. కళావతి బాయి, ఆర్ అండ్ బి ఎస్ఇ యుగంధర్, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, జిల్లా మార్కెటింగ్ అధికారి అలీమ్, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.




C.E.O
Cell – 9866017966
