*జననేత్రం న్యూస్ నిర్మల్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్16*//:
మామడ మండలము కన్నెపల్లి గ్రామానికి చెందిన నలుగురు మహిళలు తూనికాకు సేకరణకు అడవిలోకి వెళ్ళగా చీకటి పడి తప్పిపోవడంతో విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ జానకి షర్మిల నాలుగు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి వారినీ సురక్షితంగా ఇంటికి చేర్చారు. ఇలాంటి సేవలు చేసినందుకు మాజీ జడ్పీ చైర్మన్ జుట్టు అశోక్, దిశా ఫౌండేషన్ ఉపాధ్యక్షులు తెలంగాణ ధూంధాం కళాకారుడు దరువు భోజన్న 57 ఉప కులాల కులల ఉపాధ్యక్షుడు గంధం గంగాధర్ పోలీస్ బృందాన్ని అభినందించారు.
