*జననేత్రం న్యూస్ చేగుంటమండల్ ప్రతినిధి ఏప్రిల్16*//:చేగుంటమండలo చందాయి పెట్ గ్రామంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఐకెపి కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐ కే పి సిబ్బంది మాట్లాడుతూ, ధాన్య కొనుగోలు కేంద్రాన్ని గ్రామంలో ఉన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని,ధాన్యాన్ని శుభ్రంగా తాలు లేకుండా చేసి 17% తేమ ఉండేటట్లుగా చేసుకొని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకురావాలని రైతులను కోరారు, ప్రభుత్వం ప్రకటించిన 500,రూపాయలు బోనస్ ప్రతి రైతు వినియోగించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సి ఏ అవుబోతు స్వామి యాదవ్, ఎర్ర కవిత,, ఐకేపీ కమిటీ మెంబెర్స్ బుడ్డ సంతోష, శిలా విరమణి,బాస రాజు,దప్పు కుమార్,బజారు స్వామి గౌడ్, ఆనందాస్ ఆంజనేయులు, దండు యాదగిరి, అయిండ్ల రమేష్, ఎర్ర గొల్ల మధు , జూగంటి శోభన్, బాలమల్లు, అవుబోతు రవి, ఎర్రగుళ్ల ఆంజనేయులు,నిరుడి ప్రవీణ్, నవీన్, రాంచంద్రం,తదితరులు పాల్గొన్నారు.


C.E.O
Cell – 9866017966
