Home Latest News ఎమ్మార్పియస్ ఓసి, ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనార్టీసంఘాల ఆధ్వర్యంలోఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డా,, బీ ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలు

ఎమ్మార్పియస్ ఓసి, ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనార్టీసంఘాల ఆధ్వర్యంలోఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డా,, బీ ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలు

by Jananethram News
0 comments

*సామజిక న్యాయం అంటే సమాన పంపిణి నే అని సూచించిన మహనీయ అంబేద్కర్ మార్గం లోనే ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నాం

*భవిష్యత్ లో సబ్బండ వర్గాల సమస్యల సాధనకై ముందుకు సాగుతా. *జననేత్రం న్యూస్ ప్రతినిధిఏప్రిల్15*//:యాదాద్రి భువనగిరి జిల్లా – ఆలేరు నియోజకవర్గం –

ఆత్మకూర్ (యం) మండల కేంద్రం
పీడిత వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం ఆత్మకూర్ (యం) మండల కేంద్రంలోని భువనగిరి – మోత్కూర్ మెయిన్ రోడ్డు వద్ద అంబేద్కర్ చౌరస్తాలో బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి ఎమ్మార్పియస్, ఓసీ, ఎస్సీ, ఎస్టీ,బీసి మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మార్పియస్ రాష్ట్ర నాయకులు – ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అంటరానివారుగా పరిగణించబడే పేద కుటుంబంలో పుట్టినా ఎదురుచూపులు కాచుకుంటూ ఎదిగి వచ్చారన్నారు. సాంఘిక పరమైన ఆర్థికపరమైన అవమానాలతో నిరంతరం పోరాడుతూ స్వయంకృషితో పైకి వచ్చారు. ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ విదేశాలలో విద్యాభ్యాసం పూర్తిచేసి జాతి గర్వించే స్థాయికి ఎదిగారని కొనియాడారు.ప్రపంచం లోనే అతిపెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగాన్ని భారత దేశానికి అందించారని అన్నారు.ఉన్నతాధికార హోదాలు, ధనార్జన ఆయన కాళ్లకు బంధనాలు వేయలేకపోయాయని చెప్పారు. ఎన్నో ఉన్నత పదవులను సైతం తృణప్రాయంగా త్యజించి తన జీవితాన్ని దళిత జాతుల ఉన్నతికి అంకితం చేసిన మహనీయుడు అని కొనియాడారు. భారతదేశ ప్రథమ న్యాయశాఖ మంత్రిగా, రాజ్యాంగ రచన సంఘ అధ్యక్షునిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని చెప్పారు. ప్రతి పౌరునికి ప్రాథమిక హక్కులు లభించడానికి, చట్టం ముందు అందరూ సమానులేనని చాటడానికి, అస్పృశ్యత నేరం అన్న అంశాన్ని చట్టబద్ధం చేయడానికి ఆయన చేసిన కృషి మూల కారణమని పేర్కొన్నారు. తరతరాలుగా మతం పేరుతో బూజు పట్టిన భావాలతో తోటి వారిని ముఖ్యంగా మహిళలను విచక్షణకు, అవమానాలకు, అన్యాయానికి, అత్యాచారాలకు గురి చేస్తున్న వ్యవస్థపై పోరాటంలో భాగంగా ఆయన హిందూ కోడ్‌ బిల్లును రూపొందించారన్నారు.సామాజిక రుగ్మతలకు, మూఢ విశ్వాసాలకు కట్టుబడిన జాతిని విముక్తం చేసి ఆధునికత దిశగా సంస్కరణలు, శాసన బద్ధం చేయనీయకుండా ఎదురైన వ్యతిరేకతకు నిరసనగా మహిళ హోందుకోడ్ బిల్లు కోసం ఆయన కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలిగారని చెప్పారు. అంబేద్కర్ కోరింది ప్రజాస్వామిక పంథా, ఆశించింది ఆర్థిక సామాజిక రాజకీయ సమానత్వం అన్నారు. నైతిక విలువలతో కూడిన శాంతియుత ప్రజాజీవనం స్వతంత్ర సమానత్వం ప్రాతిపాదికలుగా భారతీయ సమాజాన్ని పునర్ నిర్మించాలన్నదే ఆశయమని అన్నారు.అంబేద్కర్ జీవితం సమకాలిక సమాజానికి, ముఖ్యంగా యువతరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మహనీయుడు అంబేద్కర్ సూచించిన సామాజిక న్యాయం అంటే సమాన పంపిణి అనే సూత్రంతోనే ఎమ్మార్పియస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో 30 ఏండ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసి ఎస్సీలలో ని అన్ని కులాలకు జనాభా దామాషా ప్రకారం సమాన అవకాశాలు అందడం కోసం సమాజం లోని అన్ని వర్గాల ప్రజల మద్దతు తో ఎస్సీ వర్గీకరణ చట్టం సాధించామని అన్నారు.మహానీయ అంబేద్కర్ గారి జయంతి రోజే ఎస్సీ వర్గీకరణ జీవో రావడం దళిత వర్గాల్లో వెలుగులు ప్రసాదించే రోజు గా భావిస్తున్నామని అన్నారు. భవిష్యత్ లో కూడా సమాజం లోని అన్ని వర్గాల ప్రజల సమస్యలపై డా,, బీ ఆర్ అంబేద్కర్ మార్గం లో పోరాడుతామని అన్నారు.
ఈ కార్యక్రమం లో
ఎమ్మార్పియస్, ఓసీ ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనార్టీ సంఘాల నాయకులు ఎమ్మార్పియస్ రాష్ట్ర నాయకులు
ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ,
మండల ఇంచార్జీ మందుల లింగ స్వామి మాదిగ,
బోడ స్వామి మాల,గట్టు రాములు మాదిగ, రంగా స్వామి గౌడ్, గట్టు శంకర్ మాదిగ,యం డీ శానూర్,గట్టు శేఖర్ మాదిగ,, రమణ రెడ్డి, మంద చంద్రయ్య మాదిగ,శ్రీనివాస చారి, గట్టు జ్ఞానేశ్వర్ మాదిగ, మందుల విజయ్ మాదిగ, శిగ మల్లేష్ గౌడ్,భట్టు సైదులు మాదిగ, కందుల మల్లేష్ మాదిగ, సుంచు స్వామి మాదిగ,ఇంద్రపల్లి కళ్యాణ్ బైండ్ల,సూరరం మహేష్ మాదిగ,జర్నలిస్ట్ లు దబ్బేటి దయానంద్ గౌడ్, ఎలిమినేటి నగేష్,చెరుకు శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు దడిపల్లి వెంకన్న,మందుల శ్రీధర్ మాదిగ, జామ కరుణాకర్ మాదిగ, వరికిప్పల కృష్ణ మాదిగ, వనం రవి, కదిరే ఎల్లా స్వామి తదితరులు పాల్గోన్నారు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird