Home Latest News భూ భారతి ప్రారంభోత్సవ సభలో

భూ భారతి ప్రారంభోత్సవ సభలో

by Jananethram News
0 comments

*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ఏప్రిల్14*//:భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే భూ భారతిని తీసుకు వచ్చామని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు.
సోమవారం శిల్పకళా వేదికలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి “భూ భారతి” ప్రారంభోత్సవ చేశారు.
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో పోరాటాలన్నీ భూమితోనే ముడిపడి ఉన్నాయని, కొమురం భీమ్ జల్ జమీన్ జంగిల్ పోరాటం, సాయుధ రైతాంగ పోరాటం, కమ్యూనిస్టు సోదరుల పోరాటాలన్నీ భూమి కోసమే జరిగాయని ఆయన తెలిపారు.
గత పాలకులు రెవెన్యూ చట్టాలను మార్చి తెచ్చిన ధరణి ప్రజల పాలిట భూతంగా మారిందని అన్నారు
ధరణి చట్టం ద్వారా నష్టం జరిగిన రైతులు తహసీల్దార్ పైనే పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు.
రెవెన్యూ అధికారులను దోపిడీదారులుగా చిత్రీకరించి లబ్ది పొందాలని ఆనాటి పాలకులు ఆలోచన చేశారని, చట్టాలను చట్టాలుగా మార్చుకుని వేలాది ఎకరాలు కొల్లగొట్టిన మాట వాస్తవం కాదా? అందుకే పేదలకు మేలు చేసేందుకు నూతన ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకొచ్చామన్నారు.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే భూ భారతిని ప్రారంభించుకున్నామని, ముందుగా పైలట్ ప్రాజెక్టుగా నాలుగు మండలాల్లో చేపడుతున్నామని,
వివాద రహిత భూ విధానాలను తీసుకు రావాలని మా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు
ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత రెవెన్యూ అధికారులపైనే ఉందన్నారు. రెవెన్యూ అధికారులను ప్రజలకు చేరువ చేయాలనేదే మా ఉద్దేశ్యమని తెలిపారు.
గత పాలకుల్లా మిమ్మల్ని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ఆలోచనకు మేం వ్యతిరేకమని, ఆనాటి ముఖ్యమంత్రి రెవెన్యూ అధికారులపై అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడారో మీకు తెలుసు, మేం అవినీతికి పాల్పడే వ్యక్తులపైన కఠినంగా ఉంటాం.. కానీ వ్యవస్థపై కాదని, మేం చేసే తప్పులకు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే విధానానికి నేను వ్యతిరేకమని ఆయన తెలిపారు
భవిష్యత్ లో ఆధార్ లాగే భూమికి సంబంధించి భూధార్ తీసుకొస్తాం,
రాబోయే రోజుల్లో వ్యవసాయ భూములను సర్వే చేసి కొలతలు వేసి హద్దులు గుర్తిస్తాం, రెవెన్యూ అధికారులపై దురుద్దేశంతో కొందరు కల్పించిన అపోహలను తొలగిద్దామని
సూచించారు. కలెక్టర్లు ప్రతీ మండలంలో పర్యటించాలని ఈ వేదికగా స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా
అందరి సహకారంతో చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయండి అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారులు కేశవ రావు, షబ్బీర్ అలీ, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుదిల్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయ లక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి, కాలే యాదయ్య, ఆరికె పూడి గాంధీ ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు అదనపు కలెక్టర్లు ఆర్డీవోలు ఎమ్మార్వోలు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird