Home Latest News ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గోగినేని ఉపేందర్

ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గోగినేని ఉపేందర్

by Jananethram News
0 comments

జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ఏప్రిల్14//: నేలకొండపల్లి మండల పరిధిలోని గువ్వల గూడెం గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకల్లో విశ్రాంత సీనియర్ ఉపాధ్యాయులు గోగినేని ఉపేందరు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడినారు భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నవభారత నిర్మాణానికి ఈ భారతదేశం ఈనాడు ఈ స్థాయిలో అన్ని వర్గాల ప్రజలు సమాన అవకాశాలతో ఎదగటానికి తను రాసిన రాజ్యాంగం ద్వారా ఈ దేశ ప్రజలకు ఎంతో మేలు చేసే విధంగా ఉన్నదని తెలియజేసినారు నేడు గువ్వల గూడెం గ్రామంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని అంబేద్కరు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగినది ఈ జయంతి వేడుకల్లో గౌరవ అతిథులుగా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు వంగూరి ఆనందరావు మాదిగ మాతంగి ప్రసాద్ హెడ్మాస్టరు గువ్వలగూడం గ్రామ మాజీ సర్పంచ్ కొలకపొంగు నరసయ్య గువ్వల గూడెం గ్రామ టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బొలికొండ వెంకటనారాయణ స్టీఫెన్ లీడ్స్ అకాడమీ డైరెక్టర్ వంగూరి బ్రహ్మం లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజలకే కాక సమాజంలోని సమస్త వర్గాలకు మరియు ఈ ప్రపంచానికే ఒక ప్రపంచ మేధావిగా దిక్సూచిగా నేడు ఆయన నిలిచిన సందర్భం ఉందని సమాజంలోనే ఆనాటి కాలంలో తన సామాజిక వర్గం తన ప్రజలు తాను ఎన్నో అవమానాలకు అగాత్యాలకు గురైన సందర్భాలు కో కొల్లలుగా ఉన్నవని అటువంటి పరిణామాలను మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొని చదివే ప్రామాణికంగా తీసుకొని ఈ ప్రపంచానికే ఒక మేధావిగా అవతరించిన సందర్భంగా నేడు మన ముందుందని స్పష్టం చేసినారు వంగూరి దశరథ్ అధ్యక్షతన ఈ కార్యక్రమ నిర్వహణ జరిగిన సందర్భంలో గ్రామంలోని ఐదో తరగతిలో గురుకుల పాఠశాలలలో ఉన్నత విద్య కోసం జరిగే పోటీ పరీక్షల్లో పరీక్షలు రాయటానికి చదువుకోటానికి సిద్ధమైన పిల్లలకు వారి నుండి ఎటువంటి ఆర్థిక అవసరాలను ఆశించకుండా నిస్వార్థంతో వారికి తను చదువుకున్న చదువు సార్ధకత ఏర్పడాలనే ఉద్దేశంతో తన తోటి వారు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనినే గొప్ప ఆలోచనతో వారికి ఉచితంగా ట్యూషన్ చెప్పిన సందర్భంలో నేడు అయిదుగురు పిల్లలకు గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఐదుగురికి సీట్లు రావడం జరిగినది వారిలో వంగూరి దీక్ష రాయల ఋషి వంగూరి సమంత మాతంగి కీర్తన కొలకపొంగు స్నేహ శ్రీ లకు ఈ అవకాశాలు లభించటం జరిగినది ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రిటైర్డ్ హెడ్మాస్టర్ గోగినేని ఉపేందర్ ప్రస్తుత హెడ్మాస్టర్ గా పనిచేస్తున్న మాతంగి ప్రసాద్ గురుకుల పాఠశాలలో ప్రవేశం కొరకు ఉచితంగా ట్యూషన్ అందించిన వంగూరి దశరథకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించడం జరిగినది ఇటువంటి సేవాభావం గల వ్యక్తులు అరుదుగా ఉంటారని ఈ సందర్భంగా దశరథను వారు కొనియాడినారు అదేవిధంగా గురుకుల పాఠశాలలో సీట్లు సాధించిన ఐదుగురు పిల్లలకు ఉపేందర్ సారు ప్రసాద్ సార్లు కొంత పారితోషికాన్ని గురుకుల పాఠశాలలో సీట్లు సాధించుకున్న ఆ విద్యార్థులకు ఈ సందర్భంగా వారి తల్లిదండ్రుల సమక్షంలో అందజేయడం జరిగినది ఇటువంటి పరిణామాలను గ్రామ ప్రజలు అంబేద్కర్ జయంతిలో పాల్గొన్న ప్రజలందరూ హర్షద్వానాలతో స్వాగతించినారు ఈ కార్యక్రమంలో వంగూరి ఉపేందర్ సి అర్ పి కొలకపొంగు వెంకటేశ్వర్లు వంగూరి మోహన్ రావు కోల్కపొంగు శశి మాతంగి ముత్తయ్య మాతంగి ఉపేందర్ కృప రాంబాబు వంగూరి వెంకమ్మ వంగూరు ఎల్లమ్మ మేనాల ధనమ్మ కొలకపొంగు నాగమ్మ సరోజన విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird