*అక్రమ నిర్మాణాలకు అనుమితిచ్చిన మున్సిపల్ అధికారులను సస్పెండ్ చేయాలి
*నాలుగేళ్లుగా ఫిర్యాదులు చేసిన పట్టించుకోని జిల్లా అధికారులు
*విలేకరుల సమావేశంలో సేవా అధ్యక్ష కార్యదర్శులు కొణిదెన మురళి, బి లక్ష్మారెడ్డి ఆవేద జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ఏప్రిల్ 14*//: ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల గ్రామంలో టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కొనుగోలు చేసిన 55 ఎకరాల భూమిలో కొంత భాగాన్ని కొందరు అక్రమ పద్దతిలో నకిలీ పహాణి సృష్టించి డబుల్ రిజిస్ట్రేషన్ చేసినవారు, చేయించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు 'స్మాల్ ఎంటిటైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్' (సేవా) అధ్యక్ష, కార్యదర్శులు కొనిదెన మురళి, బి. లక్ష్మారెడ్డి లు ఆరోపించారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల గ్రామ సర్వేనెంబర్ 138 నుండి 145, 159, 160 లలో 55 ఎకరాల భూమిని టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీ వారు 1987 సంవత్సరంలో అట్టి భూమిని కొనుగోలు చేసి, ప్లాట్లుగా విభజించి ఉద్యోగులకు ఇవ్వడం కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కాగా వీటిలో కొంత భాగాన్ని కొందరు వ్యక్తులు నకిలీ పహాణిలు సృష్టించి ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్టార్ సహకారంతో 2018-19 సంవత్సరంలో అక్రమ పద్ధతిలో డబుల్ రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం, దానికి ఖమ్మం కార్పొరేషన్ అధికారులు కూడా అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం పిఎమ్ఎల్ఏ - 2002 చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులపై విచారణ చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా జిల్లా కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసిన స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 'భూ భారతి' చట్టం వచ్చిన నేపథ్యంలో ఇప్పటికైనా జిల్లా అధికారులు విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. 1987లో ఇంటి నిర్మాణం కోసం భూమిని కొనుగోలు చేసుకున్న కొందరు చిరుద్యోగులు నేడు ఆ భూమిలో సొంత ఇల్లు నిర్మించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. పదవీ విరమణపొంది ఆర్ధిక, శారీరక ఇబ్బందుల్లో ఉన్నారని, వారి పరిస్థితిని అర్థం చేసుకొని న్యాయం చేయాలని వారు కోరారు.
