*జననేత్రం న్యూస్ ఏప్రిల్ 14 నిర్మల్ జిల్లా ప్రతినిధి*//సారంగాపూర్ మండల కేంద్రంలో చించోలి యం లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. బిజెపి మండల అధ్యక్షుడు కాలువ నరేష్ మాట్లాడుతూ..
భారత దేశ ముద్దు బిడ్డ, భారత రత్న..శ్రీ బాబా సాహెబ్ డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా ఆ మహనీయునికి స్మృతి నివాళులు అర్పిస్తూ ఆ మహనీయుని బాటలో నడవాలని విద్యావంతులై ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుందని, భారత రాజ్యాంగ నిర్మాతగా స్వతంత్ర భారత తొలి న్యాయ శాఖ మంత్రిగా స్వాతంత్ర్యోద్యమ వీరుడుగా ఆధునిక భారత సమాజా నిర్మాణానికి పునాదులు వేశారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మైస శేఖర్ గంగాధర్ మహేష్ మరియు అంబేద్కర్ యువజన సంఘ నాయకులు సాయన్న, సాయెందర్, మహేందర్,మహిపాల్ భూమేష్ ,గంగన్న,తదితరులు పాల్గొన్నారు.



C.E.O
Cell – 9866017966
