Home Latest News ప్రజలకు సేవ చేయడంలో మరో ముందడుగు రోటరీ డైగ్నోస్టిక్స్ & డాక్టర్స్ కన్సల్టెన్సీ సర్వీస్

ప్రజలకు సేవ చేయడంలో మరో ముందడుగు రోటరీ డైగ్నోస్టిక్స్ & డాక్టర్స్ కన్సల్టెన్సీ సర్వీస్

by Jananethram News
0 comments

*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ఏప్రిల్13*//:ఖమ్మం గత కొన్ని సంవత్సరాల నుండి నిరుపేద ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం మరో ముందడుగు వేసింది . రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ 3150 కాట్రగడ్డ శరత్ చౌదరి చేతుల మీదగా డైగ్నోస్టిక్స్ & డాక్టర్స్ కన్సల్టెన్సీ సర్వీస్ ను ప్రారంభించడం సంతోషకరమైన విషయం అన్నారు . దీనికి ఆర్ సి అఫ్ అభ్యుదయ హైదరాబాద్ ప్రసిడెంట్ కె.రాజేష్ కుమార్ , జైమ్మకో” ( ఏ యూనిట్ అఫ్ సి కె బిర్లా గ్రూప్ ఏ జి ఎం ఎస్ ఎస్ కె సర్దార్ , ఎస్ సురేష్ బాబు వారి ఆర్థిక సహాయ చేశారని పేర్కొన్నారు . అలాగే శ్రీమతి అపర్ణ సంతోష్ తల్లాప్రగడ రోటరీ ట్రస్ట్ కి లక్ష రూపాయలు డొనేషన్ చేశారని ఎన్ సింధు ఆద్య ఓవరలాండ్ పార్క్ , కాన్సస్ యూఎస్ఏ లు ఉన్నారని పేర్కొన్నారు . పేద ప్రజలు , విశ్రాంత ఉద్యోగులు అట్టి సేవలను సద్వినియోగము చేసుకొని వైద్య పరముగా తమ యొక్క ఆర్ధిక భారమును తగ్గించుకొనవలసినదిగా రోటరీ ట్రస్ట్ చైర్మెన్ & రోటరీ జిల్లా మాజీ గవర్నర్ మల్లాది వాసుదేవ్ , కార్యదర్శి దొడ్డపనేని సాంబశివరావు , కో- ఆర్డినేటర్ పసుమర్తి రంగారావు , ఖమ్మం రోటరీ క్లబ్ అధ్యక్షులు నల్లమోతు రవీంద్రనాథ్ , కార్యదర్శి హరి శ్రీనివాస్ , అసిస్టెంట్ గవర్నర్ పలివెల భూషణ్ రావు తదితరులు తెలియజేశారు .

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird