Home Latest News వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని రద్దు చేయాలి.CPI. రాష్ట్ర సమితి సభ్యులు భద్రాచలం డివిజన్ కార్యదర్శి కల్లూరి .వెంకటేశ్వరరావు.

వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని రద్దు చేయాలి.CPI. రాష్ట్ర సమితి సభ్యులు భద్రాచలం డివిజన్ కార్యదర్శి కల్లూరి .వెంకటేశ్వరరావు.

by Jananethram News
0 comments

*జననేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో ఏప్రిల్12*//:CPI జాతీయ సమితి పిలుపులో భాగంగా. శనివారం చర్ల మండలంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన సందర్భంగా. CPI. రాష్ట్ర సమితి సభ్యులు. భద్రాచలం డివిజన్.కార్యదర్శి.మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం. భిన్న సంస్కృతులు, భిన్న జాతులు, భాషలు, మతాలు కలిగిన 147 కోట్ల మంది భారతీయులను ఒక తాటిపైకి తెచ్చిన మన రాజ్యాంగ స్ఫూర్తిగా విఘాతం కలిగిస్తున్నారని.
370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, వక్ఫ్ చట్ట సవరణ లాంటి విషయంలో అందరినీ విశ్వాసంలోకి తీసుకోకుండా ఏకపక్షంగా చట్టాలు చేస్తూ మైనార్టీలను అభద్రతాభావానికి గురి చేస్తున్నారని దేశంలో స్వేచ్ఛ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డాయి ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ నిర్బంధాల గురి చేస్తున్నారని
భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లాంటి అనేకమంది యువకులు, దేశ స్వతంత్రం కోసం ప్రాణ త్యాగం చేశారని కులం మతం కన్నా దేశం మిన్న అని భావించారని కానీ నేటి పాలకులు అధికారం కోసం కులాన్ని మతాన్ని వాడుకుంటూ ప్రజల ఐక్యతను విచ్చిన్నం చేస్తున్నారన్నారు.

సిబిఐ ఈడి ఎలక్షన్ కమిషన్ తదితర రాజ్యాంగ సంస్థలను దుర్ధినియోగపరుస్తూన్నారని. ప్రతిపక్షాలను లొంగదీసుకోవడానికి ఉపయోగించు కుంటున్నారని అన్నారు
సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ, రాష్ట్రాల హక్కులను హరించి వేస్తూ గవర్నర్ల జోక్యం పెరిగి, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను ఇబ్బందులు గురి చేస్తున్నారన్నారు. దక్షిణ-ఉత్తర రాష్ట్రాల మధ్య వివక్షత ప్రదర్శిస్తూ రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచే చర్యలు చేపడుతున్నారని ఉదాహరణకు పార్లమెంట్ నియోజకవర్గం. సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామన్నా బీజేపీ 11 ఏళ్ల కాలంలో కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను తీసివేస్తున్నారన్నారు దళితులు, ఆదివాసీలు, బలహీనవర్గాలపై దాడులు, మహిళలపై లైంగిక దాడులు, మైనార్టీలపై దాడులు, జరుగుతున్నాయని. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి లకు తలొగ్గి దేశ సౌర్వ భౌమత్వాన్ని మంట కలుపుతున్నారని. దేశంలోని సహజ వనరులను ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు ధారధత్వం చేస్తున్నారని రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు కనీస మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకొని రాకుండా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టినందుకు జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం పేరుతో కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నారని అన్నారు. నూతన జాతీయ విద్య విధానం పేరుతో విద్యను కార్పొరేట్ ఇక్కడ, కాసాయికరణ చేస్తున్నారని పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను హరించే విధంగా నాలుగు లేబర్ కోళ్లు తెచ్చి కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారని. అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో. సిపిఐ జిల్లా సమితి సభ్యులు. అడ్డగర్ల తాతాజీ. మండల సమితి సభ్యులు చల్లా లక్ష్మీనారాయణ. కల్లూరి సీతారాములు. ఉప్పులూరి నాగరాజు. తోట శ్రీను. ఉప్పులూరి వెంకట నరసమ్మ. కట్టం రత్తమ్మ. రమణ. మహేష్. రాజు. రామకృష్ణ. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird