Home Latest News మహామనిషి జ్యోతిబాపూలేతెలంగాణ ఉద్యమకారుల జాయింట్ ఆక్షన్ కమిటి చైర్మన్ సుల్తాన్ యాదగిరి

మహామనిషి జ్యోతిబాపూలేతెలంగాణ ఉద్యమకారుల జాయింట్ ఆక్షన్ కమిటి చైర్మన్ సుల్తాన్ యాదగిరి

by Jananethram News
0 comments

*జవహర్ నగర్ లో జరిగిన జ్యోతిబాపూలే 199 వ జయంతి.
*జననేత్రం న్యూస్ ప్రతినిధి ఏప్రిల్12*//:తెలంగాణ జేఏసీ నాయకులు బండకింది సింగరయ్య గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంమెజారిటీ ప్రజలైన నిమ్న జాతి వర్గాల ప్రజలకు మహామనిషి మహాత్మా జ్యోతిరావు పూలే అని తెలంగాణ ఉద్యమ కారుల జాయింట్ ఆక్షన్ కమిటీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి కొనియాడారు. 2025, ఏప్రిల్-11, శుక్రవారం రోజు మేడ్చల్ మల్కాజిగిరి, కాప్రా, జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ధళిత సంక్షేమం భవన్ లో జ్యోతిరావు పూలే 199 వ జయంతి సభ జరిగింది. తెలంగాణ ఉద్యమ జాయింట్ ఆక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆ సంస్థ రాష్ట్ర నాయకులు బండకింది సింగరాయ్య గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలకు చెందిన నేతలు పాల్గొని ప్రసంగించారు. ముఖ్య అథితిగా పాల్గొన్న సుల్తాన్ యాదగిరి ప్రసంగిస్తూ ఎన్నో వేల సంవత్సరాలుగా పంచములకు విద్య అందని ద్రాక్షపండుగా ఉన్న సమయంలో వారిలో అక్షర జ్ఞానాన్ని అందించిన మహాయోదుడు జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు. మహిళల ఉనికికి, వారి అభివ్రుద్దికి పూలే దంపతుల క్రుషి, పట్టుదల నేటి సామాజిక అభివృద్ధి లో వారి పాత్రను మరువలేమని అన్నారు. పూణేలో బాలిక పాఠశాల ఏర్పాటుతో దేశ భవిష్యత్తుకు బాటలేశారని అన్నారు. సతీసహగమనాన్ని, అంటరాని తనాన్ని వ్యతిరేకంగా ఉద్యమించారని గుర్తుచేశారు. వితంతు విహాలను ప్రోత్సహించి, సమానత్వం కోసం పరితపించిన వ్యక్తి మహాత్మా జ్యోతిబాపూలే అని కీర్తించారు. ఇలాంటి క్రమంలో అసమానతలు, బాల్య వివాహాలు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం జరిపిన పూలే దంపతుల ఆశయాల సాధనలో సమసమాజ స్థాపనలో నడుం కట్టాలని సుల్తాన్ యాదగిరి పిలుపునిచ్చారు. ఈపై కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గడ్డం శ్రీనివాస్, సిపిఎం శివన్నారాయణ, నగేష్, బీఎస్పీ బిర్రు యాకస్వామి, సుప్రియ రెడ్డి, పీఓడభ్ల్యూ(విముక్తి) పి.సునీత, మహానీయుల ఉత్సవ కమిటీ సాక్షి సురేందర్, పరుశురాం, టియుజేఏసి ప్రపుల్ రాంరెడ్డి, చర్చల చంద్రన్న ప్రసాద్, తెలంగాణ ఉద్యమ కళాకారుల వేధిక ఏ.యాదగిరి, డోలక్ యాదగిరి, తెలంగాణ ఉద్యమ మహిళా వేధిక బాకారం లావణ్య, సిజి, బహుజన రక్షణ సమితి విజయ్ శంకర్ మరియు ఐ.ఎఫ్.టి.యు. షేక్ షావలి తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు. అనంతరం జ్యోతిబాపూలే చిత్రపటానికి పుష్పాంజులతో నివాళులు అర్పించారు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird