జననేత్రం న్యూస్ ప్రతినిధి ఏప్రిల్08//: చేగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్రఉపాధ్యాయుడిగా పని చేస్తున్న సుధాకర్ రెడ్డి కూతురు నిఖితారెడ్డి గ్రూప్ 1 ఫలితాలలో రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకు, మల్టీజోన్ రెండో ర్యాంకు సాధించిన సందర్భంగా చేగుంట పాఠశాల ఉపాధ్యాయులు ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అయిత పరంజ్యోతి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలు పుట్టగానే సంతోషం కంటే, వారు ప్రయోజకులు అయినప్పుడే సంతోషం ఎక్కువగా ఉంటుందని, ఒక మారుమూల గ్రామంలో పుట్టి రాష్ట్రస్థాయిలో ఎనిమిదో ర్యాంకు సాధించడం చాలా సంతోషమని, త్వరలో డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సమాజానికి సేవ చేయాలని, దేశంలోనే మంచి డిప్యూటీ కలెక్టర్ గా గుర్తింపు పొందాలని, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు కూడా భవిష్యత్తులో మంచి స్థానంలో ఉండాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఎంఈఓ నీరజ, రాజేశ్వర్ సుధాకర్ రెడ్డి, రాధా ,రమ, చల్లా లక్ష్మణ్,సురేందర్, శారద, వెంకటేష్, భవాని రేఖ శ్రీవాణి, సరస్వతి, పులి రమేష్ తదితరులు పాల్గొన్నారు
