*జననేత్రం న్యూస్ ఏప్రిల్07 నిర్మల్ జిల్లా ప్రతినిధి*//-
సారంగాపూర్ మండల కేంద్రంలో బోరిగాం,ధని సాయినగర్ తాండ గ్రామాలలో ప్రారంభమైన పాదయాత్ర లోభాగంగా
బీజేపి రాజ్యాంగాన్ని అవహేళన పరిస్తుందిని
దేశంలోని పౌరులందరికీ రాజ్యాంగ ఫలాలు అందాలని,బీజేపి మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తూ,రాజ్యాంగాన్ని అవహేళన చేస్తుందని ,కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లాఅధ్యక్షులుకూచడి శ్రీహరి రావు అన్నారు.సోమ వారం రోజున
సారంగాపూర్ మండలం లోని బోరిగాం, ధని ,సాయినగర్ తాండ, గ్రామాలలో జై భీమ్,జై బాపు,జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను ప్రారంభించారు.గ్రామాల్లోని వీధి వీధికి తిరుగుతూ బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని ఏ విధంగా అవమానపరుస్తుందో ప్రజలకు వివరించారు.దేశ సమగ్రతను కాపాడడంలో బీజేపీ రాజకీయాలు చేస్తోందని న్యాయ్ భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ దేశ ఐక్యతను చాటి చెప్పారని అన్నారు.పార్లమెంట్ లో బీజేపీ నాయకులు రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ను అవమానపరిచారని తక్షణమే అమిత్ షా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.పాదయాత్ర ద్వారా బీజేపీ చేస్తున్న అరాచకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తమని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సారంగాపూర్ మండల అధ్యక్షులు బొల్లోజి నర్సయ్య,మండల ప్రధాన కార్యదర్శి ముత్యం రెడ్డి,మార్కేట్ చైర్మెన్ అబ్దుల్ ఆది, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దశరథ్ రాజేశ్వర్,ఆలూరు ఎఫ్ ఎ సి ఎస్ చైర్మన్ మాణిక్ రెడ్డి,మార్కెట్ వైస్ చైర్మన్ శంకర్ రెడ్డి మరియు డైరెక్టర్లు పోత రెడ్డి, అహ్మద్ ముక్తార్, సుభాషు రెడ్డి, సారంగాపూర్ మండల సోషల్ మీడియ కన్వీనర్ సాక్ పెళ్లి సురేందర్ కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు,నారాయణ రెడ్డి, భోజగౌడ్, కోర్వ నవీన్ రెడ్డి, సత్యం, లక్ష్మణు,దాసరి రమేష్, బట్టు భోజన్న,అశోక్ మండలయూత్ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ షాఫీ నాయకులు,కార్యకర్తలు మాజీ సర్పంచ్ లు పోతారెడ్డి,రవీందర్ రెడ్డి,మధుకర్, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి,సూర్యం తదితరులు మూడు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.



C.E.O
Cell – 9866017966
