*జననేత్రం న్యూస్ ప్రతినిధి నిర్మల్ జిల్లా ఏప్రిల్05*//:
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలకేంద్రంలో కౌట్ల (బి)మరియు శాంతి నగర్ గ్రామంలో అంబేద్కర్ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.జై బాపు,జై భీమ్,జై సంవిధాన్, కార్యక్రమంలో భాగంగా పది సంవత్సరాలపాటు కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది ఏలాంటి అభివృద్ధి చేయలేదన్నారు.మత రాజకీయాలను రెచ్చగొడితే అధికారంలోకి వచ్చిందన్నారు. రాజ్యాంగాన్ని అవమానిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ఆప్రజాస్వామ్య పాలన సాగిస్తుందని ఆరోపించారు.రాజ్యాంగ పరిరక్షణ మన అందరి బాధ్యత అని ప్రతీజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బొల్లోజు నర్సయ్య, డిసిసిబి డైరెక్టర్ ఐరా నారాయణరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దశరథరాజేశ్వర్, సారంగాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు యూత్ కాంగ్రెస్ సభ్యులు సుమన్,సాయి,నాయకులు పోతా రెడ్డి,నారాయణ రెడ్డి, భోజగౌడ్, కోర్వి నవీన్ రెడ్డి,సలీమ్ ,సోషల్ మీడియా కోఆర్డినేటర్ సాక్ పెళ్లి సురేందర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

