*జననేత్రం న్యూస్ ప్రతినిధిమార్చి30*//:జగ్గయ్యపేట మండలం షేర్ మహ్మద్ పేటకు చెందిన గంజి వెంకట్ , గత 17 సంవత్సరాలుగా నందిగామలో ఫోటోగ్రాఫర్‌గా సేవలందిస్తున్నారు.
2025 మార్చ్28 న, అనిగండ్లపాడుకు చెందిన శ్రీనివాస్ విజయవాడలోని స్వర హాస్పిటల్లో బైపాస్ సర్జరీకి అవసరమైన అరుదైన AB నెగటివ్ రక్తం కోసం వేచిచూస్తుండగా, ఈ సమాచారం తెల్లపుట్ట క్రాంతి ద్వారా బ్లడ్ డోనర్స్ సమూహానికి చేరింది.
ఆ సమయంలో స్పందించిన గంజి వెంకట్ దూరాన్ని లెక్కచేయకుండా వెంటనే విజయవాడ వెళ్లి, ఎనిమిదో సారి AB నెగటివ్ రక్తాన్ని దానం చేశారు.
వెంకట్ త్యాగాన్ని గుర్తించిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, వైద్యులు, బ్లడ్ డోనర్ సభ్యులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
వెంకట్ మాట్లాడుతూ:
“రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం. ఇది నా అనుభవం. రక్తదానం చేద్దాం, ప్రాణదాతలమవుదాం” అని ప్రజలకు పిలుపునిచ్చారు.


