*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ఖమ్మం, మార్చి19*//:ఐదు విడతల కరువుభత్యం, మెడికల్ బిల్లులు, పి. ఆర్. సి, ఉద్యోగ విరమణ బకాయీలుగురించి సంవత్సర కాలంగా ఎంతో ఆశతో ఎదురు చూసిన పెన్షనర్లు, ఉద్యోగులను బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం, ఖమ్మం జిల్లా యూనిట్ తెలిపింది.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెన్షనర్లకు, ఉద్యోగులకు సంభందించిన కరువుభత్యం, మెడికల్ బిల్లులు, ఉద్యోగవిరమణ బకాయిలుచెల్లించేలా, పిఆర్ సిసత్వరం ప్రకటించి అమలుపరచాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు పరిశపుల్లయ్య, ప్రధాన కార్యదర్శి రాయలరవికుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు


C.E.O
Cell – 9866017966
