Home Latest News 16న కన్నెగంటి ‘భుజం మీదభూమి’పుస్తకావిష్కరణ

16న కన్నెగంటి ‘భుజం మీదభూమి’పుస్తకావిష్కరణ

by Jananethram News
0 comments

*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో మార్చి 13//:ప్రముఖ కవి, వాగ్గేయ కారుడు, పాఠ్య పుస్తక రచయిత, ప్రధానోపాధ్యాయులు కన్నెగంటి వెంకటయ్య కలం నుండి జాలువారిన ‘భుజం మీద భూమి’ కవితా సంపుటిని ఈ నెల 16న ఆవిష్కరించనున్నట్లు జాషువా సాహిత్య వేదిక అధ్యక్ష కార్యదర్శులు మువ్వా శ్రీనివాసరావు, పగిడిపల్లి వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మంలోని న్యూవిజన్ కాలేజీలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు జరుగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వివుర్శకులు జి.లక్ష్మీనర్సయ్య, జిహెచ్‌ఎంఏ జిల్లా అధ్యక్షులు ఆర్.వీరాస్వామి, జిల్లా విద్యాశాఖాధికారి ఇ.సోమశేఖరశర్మ హాజరై ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ విమర్శకులు సైదులు ఐనాల సమీక్షించనున్నట్లు తెలిపారు.
ఇంకా ఈ కార్యక్రమానికి రచయిత్రి వురిమళ్ల సునంద, కవులు రౌతు రవి, వేుడగాని శేషగిరి, గద్దపాటి శ్రీనివాస్, పోతగాని సత్యనారాయణ, యనగందుల దేవయ్య, నామా పురుషోత్తం, అమృతవర్షిణి జయరాజు, టిడబ్ల్యూఆర్‌ఎస్ లెక్చరర్
ఎస్.రవికుమార్, సిపిఎం నాయకులు సిహెచ్ చలపతిరావు, టిజిఓ జిల్లా కార్యదర్శి మోదుగు వేలాద్రి, కన్నెగంటి అరుణకుమారి, ఎంఇఎఫ్ సీనియర్ నాయకులు గుండెపాక నర్సయ్య, పిఆర్‌టియు జిల్లా అధ్యక్షులు వై.వెంకటేశ్వర్లు, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు షేక్ రంజాన్, కోండ్రు బ్రహ్మం తదితరులు హాజరు కానున్నట్లు తెలిపారు. జిల్లాలోని కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు, సాహిత్యాభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird