Home Latest News పూలే, అంబేద్కర్ స్పూర్తితో కులవివక్షపై ప్రతిఘటన పోరాటాలుప్రణయ్ హత్య కేసుపై కోర్టు తీర్పు హర్షనీయంకేవీపీఎస్ ఖమ్మం జిల్లాస్థాయి సమావేశంలోరాష్ట్ర ప్రధాన కార్యదర్శిటి స్కైలాబ్ బాబు

పూలే, అంబేద్కర్ స్పూర్తితో కులవివక్షపై ప్రతిఘటన పోరాటాలుప్రణయ్ హత్య కేసుపై కోర్టు తీర్పు హర్షనీయంకేవీపీఎస్ ఖమ్మం జిల్లాస్థాయి సమావేశంలోరాష్ట్ర ప్రధాన కార్యదర్శిటి స్కైలాబ్ బాబు

by Jananethram News
0 comments

*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో మార్చ్11*//నేటి ఆధునిక యుగంలో కూడా గ్రామ సీమల్లో కులవివక్ష అంటరానితనం ప్రత్యక్షంగా, పట్టణాల్లో పరోక్షంగా కొనసాగుతుందని దీనిని సహించబోమని ఏప్రిల్ నెలలో జరుగు ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు.
మంగళవారం ఖమ్మం ఎన్ ఎస్ పి క్యాంపు మంచికంటి ఫంక్షన్ హాల్ లో జరిగిన కేవీపీఎస్ జిల్లా స్థాయి సమావేశం కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు ముత్తమాల ప్రసాద్ జిల్లా ఉపాధ్యక్షులు పాపిట్ల సత్యనారాయణ లు అధ్యక్షవర్గంగా వ్యవహరించారు ముఖ్యఅతిథిగా హాజరైన కేవీపీఎస్ రాష్ట్ర ప్రదాన టి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ
నేటికి దళితులకు గుడి ప్రవేశం లేని గ్రామాలు, బతుకమ్మ ఆడనీయని గ్రామాలు, క్షవరం చేయకపోవడం,దసరా పండుగ సందర్భంగా జమ్మి ఆకు తెంపారని దాడి, హోటళ్ళలో రెండు గ్లాసుల పద్ధతి, పాఠశాలల్లో దళితులు మధ్యాహ్న భోజనం వంట చేస్తే విద్యార్థులు తినకపోవడం రచ్చబండ మీద కూర్చొనియ్యకపోవడం వంటి కులవివక్ష రూపాలు కొనసాగున్నాయని చెప్పారు పట్టణాల్లో దళితులకు ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదన్నారు ఇంకా అనేక రూపాల్లో కుల వివక్ష అంటరానితనం కొనసాగుతుందన్నారు వీటన్నిటిని పారద్రోలటానికి ఉన్న చట్టాలు జీవోలు రాజ్యాంగబద్ధమైన హక్కులను పాలకవర్గాలు అమలు చేయడంలేదన్నారు ఈ వివక్ష రూపాలపై ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలు నిర్మించాలన్నారు ఏప్రిల్ నెల మొత్తాన్ని మహనీయుల మాసంగా కేవీపీఎస్ ప్రకటించి పూలే అంబేద్కర్ జన జాతరలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు కుల వివక్ష అంటరానితనం ఎక్కడ కొనసాగితే అక్కడ ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటం నిర్మించాలన్నారు కులవివక్ష అంటరానితనాన్ని సమూలంగా నిర్మూలనకు కేవీపీఎస్ సన్నద్ధం అవుతుందన్నారు
కులవివక్ష అంటరానితనం కుల దురహంకారహత్యలు సాంఘిక బహిష్కరణలు జోగిని వ్యవస్థ ఇలాంటి వాటిని పారద్రోలటానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, రాజ్యాంగ హక్కులు, చట్టాలు అమలుకోసం ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు నల్గొండ జిల్లా కోర్టు ప్రణయ్ హత్య కేసులో ఇచ్చిన తీర్పుపట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు రాష్ట్రంలో జరిగిన 128 కుల దురహంకార హత్యల్లో బలైన వారందరికీ నివాళులర్పించారు. కుల దురహంకార హత్యలకు పాల్పడిన ప్రతి ఒక్కరికి నల్గొండ జిల్లా కోర్టు మాదిరిగే తీర్పులు రావాలని ఆకాంక్షించారు రాష్ట్రంలో మరో కుల దురహంకార హత్య జరగకుండా కులాంతర వివాహితులు రక్షణ చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు .సామాజిక ఉద్యమ ప్రతిఘటన పోరాటాలను సామూహికంగా పౌర సమాజం కూడా బలపరచాలని ఆయన కోరారు
కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్ మాట్లాడుతూ
జిల్లాలో కూడా ఇంకా కొన్ని గ్రామాల్లో దేవాలయ ప్రవేశం లేకపోవడం వంటి కులవివక్ష కొనసాగుతుందన్నారు. ఏప్రిల్ నెల మొత్తాన్ని మహనీయుల మాసంగా ప్రకటించుకొని వారి స్పూర్తితో కులవివక్షపై ప్రతిఘటన పోరాటాలు నిర్మిస్తామని చెప్పారు.జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు సంఘాలు సహకరించాలన్నారు
కేవీపీఎస్ జిల్లా నాయకులు మాచర్ల భారతి బండి రమేష్ లు మాట్లాడుతూ
కుల వివక్ష అంటరానితనం నేటికీ కొనసాగుతుండటం మన దేశం యొక్క హీనస్థితికి అద్దంపడుతుందన్నారు యువతరం ఇలాంటి సామాజిక రుగ్మతులను పారద్రోలటానికి సంసిద్ధం కావాలన్నారు కులదురహంకార హత్యలకు భావితరం బలవుతుందని చెప్పారు .
ఈ సమావేశంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బొట్ల సాగర్, కొమ్ము శ్రీను నకిరేకంటి చిరంజీవి సర్వేశ్వర్ రావు నరేష్ పగిడికత్తుల నాగేశ్వర్ రావు మద్దాల ప్రభాకర్ ఎస్ కె సైదులు, భద్రయ్య తిరుమల్ రావు,ఏర్పుల రాములు ఐద్వా డి వై ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శులు బండి పద్మ ఎం డి బషీర్ ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు సుధాకర్ నందిపాటి పావని, నకిరేకంటి కుమారి తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird