Home Latest News రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జీవో అమలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామకాలు చేపట్టటం సరి అయింది కాదు చీమల దారి విశ్వనాథన్ గౌడ్

రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జీవో అమలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామకాలు చేపట్టటం సరి అయింది కాదు చీమల దారి విశ్వనాథన్ గౌడ్

by Jananethram News
0 comments

*జననేత్రంన్యూస్ఉమ్మడిఖమ్మంజిల్లాబ్యూరోమార్చ్09*//:తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీవర్గీకరణజీవోఅమలుపరచకుండా దానికి చట్టబద్ధత లేకుండా నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టడం అనేది సరైనది కాదని ఖమ్మం జిల్లా బీసీ సంఘం గౌడ సంఘం నాయకులు చీమల దారి విశ్వనాథన్ గౌడ్ స్పష్టం చేసినారు నేడు ఖమ్మం రూరల్ మండల కేంద్రంలోని రూరల్ మండలం ప్రాంతంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి చేపట్టిన రిలే నిరాహార దీక్షలను పూలదండలు వేసి ఆయన ప్రారంభించినారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్గీకరణ జీవోకు చట్టబద్ధత లేకుండా నేడు ఉద్యోగ నియామకాలు చేపట్టడం అంటే ఎంతవరకు సమంజసం అని ఈ సందర్భంగా తెలియజేసినారు వర్గీకరణ జీవో అమలు చేసిన తర్వాతనే ఈ ఉద్యోగం నియామకాలు చేపడితే మాదిగల్లోనే మాదిగ ఉపకలాలకే కాక ఎస్సీ జాబితాలోని 59 కులాలకు సామాజికంగా సరైన న్యాయం జరుగుతుందని తెలియజేసినారు నేడు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత అమలు లేకుండా ఈ ఉద్యోగ నియామకాలు చేపడితే 30 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమ పోరాట ఫలితం లేకుండా పోతుందని ఇది సరి అయింది కాదని దీనివల్ల ఎస్సీ జాబితాలోని 59 కులాల అవకాశాలను ఒకటి రెండు కులాలే అనుభవించే పరిస్థితి దాపురిస్తుందని ఇటువంటి ప్రమాదం రాకుండా ఉండాలి అంటే వర్గీకరణ అమలు చేసి మాత్రమే ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసినారు మూడు దశాబ్దాల పోరాటం వర్గీకరణ అమలు లేకుండా ఉద్యోగాలు నియామకాలు చేపడితే ఏ విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీరికి న్యాయం చేస్తుందో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేసినారు ఇప్పటికైనా తక్షణం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరాలోచించుకొని వర్గీకరణ జీవో అమలు చట్టాన్ని రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన తర్వాతనే ఈ ఉద్యోగం నియామకాలు పూర్తి చేస్తే షెడ్యూల్ క్యాస్ట్ లోని 59 కులాలకు సామాజిక న్యాయం జరిగి తీరుతుందని స్పష్టం చేసినారు ఈ నిరాహారదీక్ష కార్యక్రమంలో ఎంఎస్పీ జాతీయ నాయకులు వంగూరి ఆనందరావు మాదిగ జిల్లా ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కనకం జనార్దన్ మాదిగ ఖమ్మం జిల్లా ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బోయన కృష్ణ మాదిగ కమ్మ రూరల్ మండలం మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షులు సిరిపురపు బొందయ్య మాదిగ పాపట్ల శ్రీను మాదిగ కొలకపొంగు సురేష్ మాదిగమాదిగ మామిడాల వెంకటేష్ మాదిగ దేవరకొండ రాము మాదిగ బోయిన ఋషి మాదిగ తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird