*ఉగాది నాటి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది.
*జననేత్రం న్యూస్ స్టేట్ బ్యూరోమార్చి04*//:ఆ..క్రమంలో కొత్త రేషన్ కార్డు నమూనాను సీఎం రేవంత్ రెడ్డి ఫైనల్ చేశారు. *లేత నీలి రంగులో ఈ కొత్త రేషన్ కార్డును తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. అలాగే రేషన్ కార్డుపై సీఎం రేవంత్ రెడ్డితోపాటు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు ఉండే విధంగా రేషన్ కార్డు నమూనాని ఖరారు చేశారు.
ఇక రేషన్ కార్డుపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు *ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్న వారికి కూడా కొత్త కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.* ప్రస్తుతం రాష్ట్రంలో 80 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.


C.E.O
Cell – 9866017966
