*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం బ్యూరో ఫిబ్రవరి25*//: మంగళవారం ఎదులాపురంమున్సిపాలిటీ,వరంగల్ క్రాస్ రోడ్ కి చెందిన వేమన.శ్రీనివాస్ కుమారుడైన వేమన.వర్షిత్ ఇటీవల రాష్ట్ర స్థాయి లో పలు బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొని సింగిల్స్, డబుల్స్ మరియు మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో అద్భుతమైన ప్రదర్శన ప్రదర్శించి విజేతగా నిలిచి పలు విభాగాల్లో బంగారు,కాంస్య పతకాలను సాధించాడు.వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉన్న, వర్శిత్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. వార్షిత్ ప్రతిభ గుర్తించి తల్లిదండ్రులు హైదరాబాద్ లోని అకాడమీ లో బ్యాడ్మింటన్ శిక్షణను ఇప్పిస్తూ ఈ క్రమం లో సహాయం కావాలని దాతలను కోరగా,వెంటనే స్పందించి వారి ఇంటికి వెళ్లి తన వంతు సహాయంగా బ్యాడ్మింటన్ కిట్ నిమిత్తం,పది వేల రూపాయలు(10,000/-)నగదును ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ ఆర్థిక సహాయంగా అందించారు.భవిష్యత్తులో మరెన్నో అద్భుతమైన విజయాలను సాధించాలని వారు కోరారు.వారితో పాటు పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ డైరెక్టర్ నాగార్జునపు.ప్రద్యుమ్న చారి, ఎదులాపురం మున్సిపల్ నాయకులు కళ్లెం.శేష్ రెడ్డి,కోక్కు.రాజు తదితరులు పాల్గొన్నారు


C.E.O
Cell – 9866017966
