జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ఫిబ్రవరి 21*//:కొణిజర్ల పోలీస్ స్టేషన్ లో భాధ్యతలు నిర్వహిస్తూ ఇటీవల అనారోగ్యంతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ E. లోకేశ్, అదేవిధంగా అనారోగ్యంతో మరణించిన
ఏఆర్ కానిస్టేబుల్ ఐ.బాలరాజు కుటుంబ సభ్యులకు ఒక్కొక్క కుటుంబ సభ్యులకు రూ. 8,00,000/- భద్రత ఎక్సిగ్రేసియా చెక్కు ను శుక్రవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ …శాఖపరంగా ఎటువంటి సహాయ సహకారాలు అందించేందుకైన పోలీస్ అధికారులు అందుబాటులో వుంటారని అన్నారు. పోలీసు కుటుంబాలకు అన్ని విధాల ఆదుకుంటామన్నారు.

