Home సినిమా ఊర్లో ఇల్లు అమ్మి హైదరాబాద్‌ వచ్చా.. ఆ నిర్మాత ఛాన్స్ ఇస్తానని చెప్పి.. నైనిక షాకింగ్ కామెంట్స్! – Swen Daily

ఊర్లో ఇల్లు అమ్మి హైదరాబాద్‌ వచ్చా.. ఆ నిర్మాత ఛాన్స్ ఇస్తానని చెప్పి.. నైనిక షాకింగ్ కామెంట్స్! – Swen Daily

by
0 comments
tmdb-header-middle-logo


క్యాస్టింగ్ కౌచ్ గురించి తరచూ వింటుంటాం. అప్పుడప్పుడు హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఈ జాబితాలోకి బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ డ్యాన్సర్ నైనిక(నైనికా) చేరింది. తన సినీ ప్రయాణంలో ఎదురైన చేదు అనుభవాలను, అలాగే ఊర్లో ఇల్లు ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చిందో తాజాగా బయటపెట్టింది. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

80 లక్షలతో హైదరాబాద్‌లో వ్యాపారం
ఒడిశా నుంచి హైదరాబాద్‌కు మారిన తర్వాత, తన తల్లికి ఏదైనా వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో నైనిక ఒక లగ్జరీ సలోన్ (స్టూడియో) ప్రారంభించాలని నిర్ణయించుకుంది. అయితే దీని వెనుక పెద్ద త్యాగమే ఉందని ఆమె. ఒడిశాలో తన తల్లి ఎంతో కష్టపడి కట్టుకున్న సొంత ఇంటిని అమ్మ, ఆ వచ్చిన డబ్బుతో దాదాపు రూ. 70 నుంచి 80 లక్షల వరకు పెట్టుబడి పెట్టి హైదరాబాద్‌లో ఈ సలోన్‌ను ఏర్పాటు చేసినట్లు నైనిక చెప్పింది. ప్రస్తుతం ఈ వ్యాపారం బాగానే సాగుతోందని, హైదరాబాద్ ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తోందని ఆమె సంతోషం వ్యక్తం చేసింది.

కాస్టింగ్ కౌచ్ అనుభవం
తన సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ.. వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని, కానీ క్లీన్ ప్రాజెక్ట్‌లు దొరకడం కష్టమవుతోందని. కొన్నిసార్లు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని నైనిక ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల ఓ నిర్మాత తనకు సినిమా అవకాశం ఇస్తానని చెప్పి ‘కమిట్‌మెంట్’ అడిగారని ఆమె వెల్లడైంది. “కమిట్‌మెంట్ అడుగుతూ ఓ నిర్మాత మెసేజ్‌లో ఒక ఫామ్ లాంటిది నింపమని. అది చూడగానే నాకు చాలా కోపం వచ్చింది. మీకు సిగ్గులేదా? అని గట్టిగా రిప్లై ఇచ్చాను” అని నాయికగా చెప్పారు.

నైనిక ప్రయాణం చిన్నప్పటి నుంచే చాలా కష్టాలతో కూడుకున్నది. తండ్రి నుంచి ఎదురైన వేధింపుల కారణంగా తల్లితో కలిసి ఒంటరిగా పోరాటం చేసి ఈ స్థాయికి చేరుకుంది. నేషనల్ లెవల్ డ్యాన్స్ రియాలిటీ షో ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’లో సత్తా చాటిన నైనిక, ఆ తర్వాత తెలుగులో ‘ఢీ’ షో ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. అనంతరం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో కూడా కంటెస్టెంట్‌గా అలరించి, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది.

కష్టపడి ఎదుగుతున్న నైనిక.. తన జీవితంలో ఎదురైన క్యాస్టింగ్ కౌచ్‌ అనుభవాలను పంచుకోవడంతో అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. టాలెంట్ ని బట్టి కాకుండా, కమిట్‌మెంట్ ని బట్టి అవకాశాలు ఇచ్చే కొందరు నిర్మాతల వల్లే.. ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలంటే అమ్మాయిలు భయపడుతున్నారు అంటూ నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుంచి తప్పుకున్న టోవినో థామస్!

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird