
- RC17 కోసం సుకుమార్ సంచలన నిర్ణయం
- దేవి శ్రీ ప్రసాద్ ప్లేస్ లో ‘ధురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్!
గత కొంతకాలంగా ఇండియా వైడ్ గా ‘ధురంధర్'(ధురంధర్) పేరు మారుమోగిపోతోంది. డిసెంబర్ లో విడుదలైన ‘ధుధర్’ దాదాపు రూ.1400 కోట్లతో సంచలనం సృష్టించగా, దానికి సీక్వెల్ గా ఇటీవల వచ్చిన ‘ధురంధర్2’ అంతకుమించిన వసూళ్లతో ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
‘ధురంధర్’ అద్భుత విజయంలో శాశ్వత్ సచ్‌దేవ్(శాశ్వత్ సచ్‌దేవ్) అందించిన సంగీతం కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళాడు. అలాంటి సచ్‌దేవ్ త్వరలో టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా కోసం ఆయన రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం.
‘రంగస్థలం’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా #RC17పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేయగా, తాజాగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
సాధారణంగా సుకుమార్ సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుంటాడు. వీరిద్దరి కాంబోలో వచ్చిన పాటలన్నీ చార్ట్ బస్టర్లే. అయితే, ఈసారి సుకుమార్ ఒక సరికొత్త ప్రయోగానికి సిద్ధమైనట్లు. #RC17 కోసం బాలీవుడ్ సెన్సేషన్ శాశ్వత సచ్‌దేవ్ పేరును గుర్తించినట్లు సమాచారం.
ఎవరు ఈ శాశ్వత్ సచ్‌దేవ్?
శాశ్వత్ సచ్‌దేవ్ గతంలో ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ సినిమాకు గాను నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇటీవల విడుదలైన ‘ధురంధర్ 2’ సినిమాలో ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. ఈయన మ్యూజిక్ స్టైల్ చాలా యూనిక్‌గా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఉండటంతో సుకుమార్ ఈయన్ని ఎంపిక చేసుకునే ఆలోచనలో ఉన్నారట.
సుకుమార్ సినిమాల్లో మ్యూజిక్ కి పెద్ద పీట ఉంటుంది. ఆయన డైరెక్ట్ చేసిన గత సినిమాలు ‘పుష్ప-1’, ‘పుష్ప-2’ పాన్ ఇండియా వైడ్‌గా సంచలనం సృష్టించగా, అందులో మ్యూజిక్ ఎంతటి హైలైట్ అయిందో తెలుస్తుంది. ఇప్పుడు #RC17 కోసం అంతకుమించి అనే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట. అందుకే శాశ్వత్ సచ్‌దేవ్ ని రంగంలోకి దింపుతున్నారట. అయితే చిత్ర యూనిట్ ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
షూటింగ్ అప్డేట్
ప్రస్తుతం రామ్ చరణ్ తన తదుపరి చిత్రం ‘పెద్ది’ (Peddi) షూటింగ్‌లో ప్రస్తుతం ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 30, 2026న విడుదల కావాల్సి ఉంది. ఆ తర్వాత వెంటనే సుకుమార్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఇప్పటికే సుకుమార్ దుబాయ్‌లో ఈ సినిమా స్క్రిప్ట్ పనులను పూర్తి చేసినట్లు సమాచారం.
ఒకవేళ శాశ్వత్ సచ్‌దేవ్ ఈ ప్రాజెక్ట్‌లోకి వస్తే, రామ్ చరణ్ సినిమాకు సరికొత్త సౌండ్ వినడం ఖాయం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ నిర్మిస్తోంది. సుకుమార్ మార్క్ టేకింగ్ కు ఈ ధురంధర్ మ్యూజిక్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర పూనకాలే అని చెప్పవచ్చు.

C.E.O
Cell – 9866017966


