
-కలెక్షన్స్ సునామిని సృష్టిస్తున్న ధురంధర్ 2
-అధికంగా పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
-నిజంగానే మూడు చిత్రాలని బీట్ చేసిందా!
ఎనీ సెంటర్ సింగల్ హ్యాండ్.. ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే.. అప్పుడే అయిపోయిందనుకోకు ఇప్పుడే మొదలైంది. ఈ ఫేమస్ డైలాగ్స్ ధురంధర్ 2 (ధురంధర్ 2)కి పర్ఫెక్ట్ గా వర్తిస్తాయి. లేకపోతే ఇవేం కలెక్షన్స్ అండి బాబు. జాలి, దయ అనే పదాలు కి ధురంధర్ దీక్షనరీలోనే చోటు లేదంటూ తన హవాని చాలా బలంగా చాటుతుంది. జోరు ఇలాగే కొనసాగితే ఇండియన్ సినీ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సునామి ఫిగర్ నమోదవ్వడం ఖాయం. మరి ఇప్పటి వరకు ఎంత వసూలు చేసిందో చూద్దాం.
నిన్నటితో అంటే నాలుగురోజులతో పాటు ప్రీమియర్స్ వరల్డ్ వైడ్ గా761 కోట్ల గ్రాస్ ని కలుపుకొని. ఈ మేరకు మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. దీంతో వీకెండ్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన బాహుబలి 2 (591 కోట్లు) కల్కి (500 కోట్లు), ఆర్ఆర్ఆర్ (470 కోట్లు) రికార్డులు మొత్తం ఎంత పని చేసావు బాసు. మాకే ఎసరు పెడతావని అసలు ఊహించలేదంటూ ధురంధర్ 2 కి వెల్ కమ్ చెప్పింది. దీంతో భారతీయ సినీ చరిత్రలో వీకెండ్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సెకండ్ మూవీగా ధురంధర్ నిలిచింది. ఫస్ట్ మూవీ పుష్ప 2 762 కోట్లు.
ఇది కూడా చదవండి: రేణు దేశాయ్: రేణు దేశాయ్ ఆయనకి అంధభక్తురాలంట.. ఫ్యాన్స్ పరిస్థితి ఎలా ఉంటుందో మరి
ఈ విషయంలో పుష్ప 2 ని క్రాస్ చేసినా ఏం పర్లేదని, వరల్డ్ వైడ్ గా ఉన్న ఇండియన్ మూవీ లవర్స్, సెలబ్రటీస్ ధురంధర్ బాట పడటం దాదాపు లాంగ్ రన్ లో 2000 కోట్ల మార్కుని అందుకోవడంలో అందరిలో అంచనాలు ఉన్నాయి. పుష్ప 2 టోటల్ రన్ లో 1780 కోట్ల దాకా రాబట్టిన విషయం తెలిసిందే.


