
ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం నేపథ్యంలో భారత్ అందించిన మనవతాసాయంపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇరాన్ భారత్ కు ధ్యాంక్స్ చెప్పింది. భారత్ అందించిన సహాయాన్ని తమ దేశం ఎన్నటికీ మరవదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పేర్కొన్నారు. గత వారం టెహ్రాన్‌పై జరిగిన దాడుల్లో 60 మందికి పైగా సాధారణ పౌరులు మరణించారు. వందల మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ విషాద సమయంలో భారత్ మానవతా దృక్ఫథంతో ఇరాన్ కు సహాయ హస్తం అందించింది. ఈ విషాద సమయంలో భారత్ ఇరాన్ కు వైద్య, అత్యవసర సహాయాన్ని అందించింది. ఉత్పత్తినే ఇరాన్ యుద్ధ సమయంలో భారత్ ఇలా సహాయ హస్తం అందించడం చాలా గొప్ప విషయంగా అభివర్ణిస్తూ కృతజ్ఞతలు అందించింది.
భారత్ సహాయ సహకారాలు నిజమైన స్నేహానికి నిలువెత్తు చిహ్నంగా అభివర్ణించింది. అలాగే జమ్మూ కాశ్మీర్ లోని బుద్గాం జిల్లా ప్రజలు ఇరాన్ కు విరాళాలు సేకరించిన విషయాన్ని కూడా ఇరాన్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ కృతజ్ఞతలు ప్రదర్శించారు.

C.E.O
Cell – 9866017966

