Home సినిమా పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కి కునుకు లేకుండా చేస్తున్న బ్యాడ్ సెంటిమెంట్.. నిజమేనంటారా? – Swen Daily

పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కి కునుకు లేకుండా చేస్తున్న బ్యాడ్ సెంటిమెంట్.. నిజమేనంటారా? – Swen Daily

by
0 comments
tmdb-header-middle-logo


పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘గబ్బర్‌సింగ్‌’ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. పవన్‌కళ్యాణ్ కెరీర్‌లోనే ఈ సినిమా ఓ మైల్‌స్టోన్‌గా నిలిచింది. చాలా గ్యాప్ తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. మరోసారి ఈ జంట మ్యాజిక్ చేస్తుందని ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఓ వింత సెంటిమెంట్ వారిని ఆందోళనకు గురిచేస్తోంది.

చిత్ర పరిశ్రమలో ఉన్న సెంటిమెంట్లు మరెక్కడా ఉండవు అంటే అతిశయోక్తి కాదు. టైటిల్ దగ్గర నుంచి అనేక విషయాల్లో సెంటిమెంట్స్ పెట్టుకుంటారు. దాని ప్రకారమే వెళుతుంటారు. పవన్‌కళ్యాణ్ విషయానికి వస్తే.. అది ఆయనకు సెంటిమెంట్‌గా ఉందొ లేదో తెలీదుగానీ, ఫ్యాన్స్ మాత్రం దాన్ని గుర్తు తెచ్చుకొని మరీ టెన్షన్ పడిపోతున్నారు. ఇంతకీ ఆ సెంటిమెంట్.. పవన్‌కళ్యాణ్‌తో ఒక బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన తర్వాత అదే కాంబినేషన్‌లో చేసిన రెండో సినిమా ఫ్లాప్ అయిన చరిత్ర. ఇది చాలా మంది డైరెక్టర్స్ విషయంలో నిజమైందని పవన్‌కళ్యాణ్ కెరీర్‌ని బట్టి అర్థమవుతుంది. ఆయా సినిమాల వివరాలేమిటో ఒకసారి చూద్దాం.

పవన్‌తో ‘తొలిప్రేమ’ వంటి క్లాసిక్ హిట్ తీసిన’ కరుణాకరన్ ఆ తర్వాత చేసిన రెండో సినిమా ‘బాలు’ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అలాగే ‘సుస్వాగతం’తో పవన్‌కి మెమరబుల్ హిట్ ఇచ్చిన భీమనేని శ్రీనివాసరావు ఆ తర్వాత చేసిన ‘అన్నవరం’ చిత్రాన్ని మెప్పించలేకపోయారు. కళ్యాణ్‌ని ‘బద్రి’ చిత్రంలో డిఫరెంట్‌గాజెక్ట్ చేసి భారీ విజయాన్ని అందుకున్న పవన్ ప్రొ పూరి జగన్నాథ్ రెండో సినిమాతో దెబ్బతిన్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘కెమెరా గంగతో రాంబాబు’ చిత్రం ఏవరేజ్ అనే టాక్ తెచ్చుకుంది.

‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మార్చి 19న ఉగాది కానుకగా విడుదల కాబోతోంది. ఇప్పూడీ సెకండ్ సెంటిమెంట్ బలంగా ప్రచారంలోకి వచ్చేసింది. ‘గబ్బర్‌సింగ్‌’తో బ్లాక్‌బస్టర్ సాధించిన హరీష్ శంకర్ ఈ సినిమా ఏం చేస్తాడోననే ఆందోళన ఫ్యాన్స్‌లో పెరిగిపోయింది. ఈ సెంటిమెంట్ నుంచి తప్పించుకున్న ఏకైక డైరెక్టర్ త్రివిక్రమ్.

పవన్‌కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా ‘జల్సా’. 2008లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం. 5 సంవత్సరాల గ్యాప్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అయితే 2018లో వచ్చిన మూడో సినిమా ‘అజ్ఞాతవాసి’ మాత్రం డిజాస్టర్ అయింది.

పవన్‌కళ్యాణ్‌తో రెండో హిట్ కొట్టిన డైరెక్టర్ త్రివిక్రమ్ తప్ప మరొకరు లేకపోవడంతో జరుగుతున్న ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఏర్పడింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నందున ఆయన ఇమేజ్‌కు తగ్గట్టుగా కథలో మార్పులు చేశారు. అనవసరమైన అంశాలకు తావు ఇవ్వకుండా పవర్ ఫుల్ డైలాగులు, మాస్ ఎలిమెంట్స్‌తో సినిమాను రూపొందించారు.

ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ‘కాలరే ఎత్తరా’ పాట పవన్ పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. ప్రస్తుతం అభిమానుల్లో ఉన్న ‘సెకండ్ మూవీ’ సెంటిమెంట్‌ను త్రివిక్రమ్ తరహాలో హరీష్ శంకర్ కూడా బ్రేక్ చేసి పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్‌ని అందిస్తారని ఆశిస్తున్నారు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird