
-షూటింగ్ లో వారణాసి
-తెలుగు వారి ప్రెస్టేజియస్ట్ మూవీ
-ఎందుకు అరెస్ట్ చేసారు!
‘వారణాసి'(వారణాసి).. ఏ ముహూర్తాన మహేష్ బాబు(మహేష్ బాబు), రాజమౌళి(ss రాజమౌళి), విజయేంద్రప్రసాద్, కేఎల్ నారాయణ తమ సినిమాకి ‘వారణాసి’ అనే టైటిల్ ఫిక్స్ చేసారో కానీ, వారణాసి అప్ డేట్స్ చూడకుండా నిద్రపోని పాన్ ఇండియా ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి లేదు. టేకింగ్, టెక్నీకల్, బడ్జెట్, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా కూడా తెలుగు సినిమా ఖ్యాతిని వరల్డ్ సినీ మేకర్స్ ముందు వారణాసి ద్వారా సాక్షాత్కారం. ఇంతటి ప్రతిష్టాత్మక మూవీ ఒక వ్యక్తి వలన ఎక్స్ క్లూజివ్ గా వైరల్ గా మారింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
విక్టరీ అపుయామగన్..ఉరఫ్ కెన్నీ(కెన్ని). నైజీరియా దేశస్థుడు. ఎలాంటి అనుమతులు లేకుండానే సుమారుగా ఎనిమిదేళ్లుగా మన దేశంలో సంపాదించాడు. అంటే అక్రమంగా స్టే చేస్తున్నాడు. మొన్న మార్చి 14 న హైదరాబాద్ లోని కొండాపూర్ ఏరియాలో తెలంగాణ స్పెషల్ వింగ్ ఈగల్ ఫోర్స్ (EAGLE Force) సభ్యులు కెన్నీని అరెస్ట్ చేసారు. దీనితో కెన్నీ గురించిన వివరాలన్నీ బయటకి వచ్చాయి. కెన్నీ 2018 నవంబర్‌లో ‘ఘనా’ దేశానికి చెందిన పాస్‌పోర్ట్ సంపాదించి యాకూబ్ అలీ అనే పేరుతో మెడికల్ అటెండెంట్ వీసాపై న్యూఢిల్లీకి వచ్చాడు. 20 జనవరిలోనే తేదీ వీసా గడువు ముగిసింది. కానీ తిరిగి వీసా పొడిగించుకోకుండా అక్రమంగా ఉండిపోయాడు. దీంతో హైదరాబాద్ ఫారినర్స్ రీజినల్ పోలీసులు ఆఫీస్ (FRRO) అధికారులకు అప్పగించారు. చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకపోవడం మరియు ఫోర్జరీ పాస్‌పోర్ట్ కలిగి ఉండటంతో పట్టుబడ్డ శనివారమే నైజీరియాకి పంపించారు.
కూడా చదవండి: ఉస్తాద్ భగత్ సింగ్ vs ధురంధర్ 2: ఎవరి పెర్ ఫార్మెన్స్ బద్దలు కాబోతుంది
మొదట పంజాబ్ లోని ‘లూథియానా’ లో ట్రైనర్‌గా పనిచేసి సెప్టెంబర్ 2025లో నటనపై ఆసక్తితో హైదరాబాద్ (హైదరాబాద్)కి మారి కొండాపూర్‌లో ఉన్న ఒక జీ హాస్టల్లో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. దాదాపు ఐదు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. ప్రస్తుతం వారణాసిలో ఒక క్యారక్టర్ చేస్తున్నాడు. మరి వారణాసిలో కెన్నీ ఎటువంటి రోల్ లో కనిపిస్తున్నాడు. అతని రోల్ పూర్తయిందా లేదా? అని అభిమానులు చర్చిస్తున్నారు. కెన్నీ విషయంపై వారణాసి టీం ఇంతవరకు స్పందించలేదు. ఇటీవల విడుదలైన ‘తస్కరి’ హిందీ మూవీ కూడా కెన్నీ లిస్ట్‌లో ఉంది.

C.E.O
Cell – 9866017966

