
టీ20 వరల్డ్‌క్యాప్ 2026లో అభిషేక్ శర్మ పేరు క్రికెట్ ప్రపంచంలో బాగా మార్మోగింది. దూకు బ్యాటింగ్‌తో గుర్తింపు పొందిన అభిషేక్ ప్రస్తుతం ఫామ్ కోల్పోయినట్లు కనిపించడంతో అభిమానుల నుంచి విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఫైనల్ మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో రాణించి తన ప్రతిభను మరోసారి చాటాడు.
తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ పాల్గొని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అభిషేక్‌కు పెరుగుతున్న పాపులారిటీని చూసి జట్టులోని ఇతర సభ్యులకు కొంచెం అసూయ కలిగేదని సంజూ సరదాగా వ్యాఖ్యానించాడు. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు భారత జట్టు ఎక్కడ ఉన్నా ఫ్యాన్స్ ఎక్కువగా అభిషేక్‌ను చూడటానికే క్యూ కట్టేవారని గుర్తు చేశాడు.
స్టేడియాల్లో కూడా అభిమానులు “అభిషేక్.. అభిషేక్” అంటూ నినాదాలు చేస్తుంటే, మిగిలిన భావన కనిపించడంలేదేమో అన్న వచ్చేదని సంజూ నవ్వుతూ చెప్పాడు. “అసలు స్టేడియంలో ఉన్న జనాలకు మేము కనిపిస్తున్నామా లేదా అన్న డౌట్ వచ్చేది. మేము ఉన్నా కూడా కేవలం అభిషేక్‌ను మాత్రమే చూస్తున్నారా అని మేమంతా సరదాగా మాట్లాడుకునేవాళ్లం” అని వెల్లడించారు.
ఇంకా సరదాగా “భాయ్ నువ్వు త్వరగా మ్యారేజ్ చేసుకో… అప్పుడైనా మాకు కొంచెం లైమ్‌లైట్ దక్కుతుంది” అని సంజూ చమత్కరించాడు. అదే సమయంలో అభిషేక్ కృషి, పట్టుదలను ప్రశంసిస్తూ ప్రస్తుత జట్టులో స్టార్ ప్లేయర్‌గా ఎదిగాడని కొనియాడాడు.
అదే వేదికపై అభిషేక్ శర్మ కూడా తన భవిష్యత్ లక్ష్యాల గురించి మాట్లాడాడు. భారత జట్టు అన్ని ఫార్మాట్లలో ఆడి రాణించడమే తన లక్ష్యమని తెలిపాడు. తన చేతుల్లో లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించనని, గురువు యువరాజ్ సింగ్ నేర్పిన విద్యను మాత్రమే పాటిస్తున్నానని చెప్పాడు. వన్డే జట్టులో చోటు దక్కితే అది తన కల నెరవేరినట్లే అని అభిషేక్ వెల్లడించాడు.

C.E.O
Cell – 9866017966

