
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు భారీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సోమవారం (మార్చి 16) ఆవిష్కరించారు. రాజధాని ప్రాంతంలోని తుళ్లూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల భారీ కాంస్య విగ్రహం ఏర్పాటైంది. రాజధానిలో ఏర్పాటైన తొలి భారీ విగ్రహంగా ఇది నిలుస్తోంది.
ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీ రాములు చేసిన త్యాగానికి స్పూర్తిగా ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, కొనసాగుతున్నారు. మార్చి 16వ తేదీ పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకొని, 6.80 ఎకరాల స్థలంలో ఆయన విగ్రహాన్ని పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది.
పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్‌ఆర్ధన మేరకు భూమిని ఎపి ప్రభుత్వం కేటాయించగా విగ్రహ నిర్మాణం కోసం ట్రస్ట్ విరాళాలు సేకరించారు. ఆంధ్రరాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు చేసిన నిరాహారదీక్షకు సంకేతంగా పొట్టి శ్రీరాములు 58 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ నిర్మాణం ఇప్పటి వరకు దాదాపు పాతిక కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. ఇది తొలి దశ కాగా, మలి దశలో ఇక్కడ మ్యూజియం, ఫోటో గ్యాలరీ, ఆడిటోరియం, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. వీటిని విగ్రహం కింద ఉన్న బేస్ లో ఉండే మూడు అంతస్తుల్లోఏర్పాటు చేస్తారు.

C.E.O
Cell – 9866017966

