Home Latest News మొయినాబాద్ డ్రగ్స్ కేసులో షాకింగ్ విషయాలు! | డ్రగ్ కేసు| డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్| రంగారెడ్డి జిల్లా. తెలంగాణ వార్తలు| మొయినాబాద్| ఫామ్‌హౌస్‌పై దాడి| ఔషధ పరీక్ష| సీఎం రేవంత్ రెడ్డి| తెలంగాణ పోలీస్| డీజీపీ బి. శివధర్ రెడ్డి| సీపీ సజ్జనార్| సీఎం చంద్రబాబు| నారాలోకేష్| టీడీపీ| కేసీఆర్| కేటీఆర్| టాలీవుడ్| రకుల్ ప్రీత్ సింగ్| అమన్ ప్రీత్ సింగ్ – Jananethram News

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో షాకింగ్ విషయాలు! | డ్రగ్ కేసు| డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్| రంగారెడ్డి జిల్లా. తెలంగాణ వార్తలు| మొయినాబాద్| ఫామ్‌హౌస్‌పై దాడి| ఔషధ పరీక్ష| సీఎం రేవంత్ రెడ్డి| తెలంగాణ పోలీస్| డీజీపీ బి. శివధర్ రెడ్డి| సీపీ సజ్జనార్| సీఎం చంద్రబాబు| నారాలోకేష్| టీడీపీ| కేసీఆర్| కేటీఆర్| టాలీవుడ్| రకుల్ ప్రీత్ సింగ్| అమన్ ప్రీత్ సింగ్ – Jananethram News

by Jananethram News
0 comments
news-logo


హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ గ్రామంలో ఓ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీపై పోలీసులు దాడి చేయడంతో కలకలం రేగింది. ఈ ఘటనలో కాల్పులు జరగడం, కొకైన్ స్వాధీనం కావడం సంచలనంగా మారింది. మొత్తం 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మార్చి 14 రాత్రి సుమారు 8 గంటల సమయంలో మొయినాబాద్ పోలీస్ స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఎం.డి. నయీముద్దీన్‌కు విశ్వసనీయ సమాచారం అందింది. అజీజ్‌నగర్ గ్రామంలో ఉన్న వ్యాపారి పంజుగుల రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో కొందరు వ్యక్తులు మాదక ద్రవ్యాలు మరియు భారీ మొత్తంలో మద్యం వినియోగిస్తూ పార్టీలకు సంబంధించిన సమాచారం వచ్చింది.

ఈ విషయాలను వెంటనే తెలియజేసిన ఎస్‌ఐ, NDPS చట్టం ప్రకారం అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసి ప్రత్యేక బృందంతో ఫామ్‌హౌస్‌కు బయలుదేరారు. ఈగల్ (TGNAB) బృందం, షాద్‌నగర్ SOT, చేవెళ్ల పోలీస్ బృందాలు, క్లూస్ టీమ్ సభ్యులు మరియు ఇద్దరు అధికారిక సాక్షులతో కలిసి పోలీసులు సుమారు రాత్రి 9.40 గంటలకు ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న వెంటనే సిబ్బంది ఫామ్‌హౌస్‌ను చుట్టుముట్టి లోపలికి ప్రవేశించారు. ఈ సమయంలో పోలీసులు తమను పరిచయం చేసుకుని సోదాలు నిర్వహించడంతోపాటు, ఫామ్‌హౌస్ నుంచి ఒక్కసారిగా కాల్పులు జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తక్షణమే అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ‘మేడ్ ఇన్ జర్మనీ’ అని ముద్రించబడింది .32 కాలిబర్ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ రివాల్వర్‌లో ఒక లైవ్ రౌండ్, ఒక ఖాళీ తూటా కవచం ఉండగా, అక్కడి నుంచి ఖాళీ తూటా కవర్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఢిల్లీకి చెందిన వ్యాపారి నమిత్ శర్మగా పేర్కొన్నారు. అతని పక్కనే ఉన్న సిల్వేరి శరత్ కుమార్ వద్ద నుంచి మూడు ఖాళీ తూటా కవచాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫామ్‌హౌస్‌ స్విమ్మింగ్ పూల్ పక్కన ఏర్పాటు చేసిన సోఫాల్లో మద్యం సేవిస్తున్న మరో 9 మంది పురుషులు, ఒక మహిళను పోలీసులు గుర్తించారు.

వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా శరత్ కుమార్ వద్ద చిన్న ప్యాకెట్‌లో కొకైన్ డ్రగ్ ఉందని అతను స్వయంగా ఒప్పుకున్నాడు. ఈ పార్టీలో దొరికిన 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారందరికీ డ్రగ్స్ పరీక్షలు చేశారు. అయితే అందులో ఆరుగురికి మాత్రం పాజిటివ్ రాగా మరికొందరికి నెగటివ్ వచ్చింది. దీంతో పోలీసులు మరోసారి 11మందికి డ్రగ్స్ పరీక్షలు చేశారు. అందులో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లు రక్త పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు సేకరించిన బ్లడ్ శాంపిల్స్ పరీక్షగా మహేష్ కుమార్‌కు డ్రగ్స్ పాజిటివ్‌గా ఉన్నట్లు గుర్తించారు.

అయితే మహేష్ కు మొదట నిర్వహించిన యూరిన్ టెస్ట్‌లో మాత్రం నెగిటివ్ వచ్చింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి మరోసారి బ్లడ్ టెస్ట్ జరిగింది.ఈవిచారణలో భాగంగా యూరిన్ శాంపిల్స్‌లో నీళ్లు కలిపినట్లు అధికారులు గుర్తించారు. నీళ్లు కలపడం వల్లే యూరిన్ టెస్ట్‌లో డ్రగ్స్ నెగిటివ్‌గా వచ్చినట్లు తేల్చారు. బ్లడ్ టెస్ట్‌లో మాత్రం మహేష్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లు స్పష్టంగా బయటపడింది. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి కూడా డ్రగ్స్ పాజిటివ్‌గా తేలింది. వీకెండ్ సందర్భంగా పైలట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్‌లోని తన ఫామ్ హౌస్‌లో పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ డ్రగ్స్ పార్టీలో వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. పోలీసులు సేకరించిన ఆధారాల ఆధారంగా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, కౌశిక్ రవి ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా పర్యటనకు వెళ్లిన సమయం లో ఒక వ్యక్తి నుండి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అనంతరం వాటిని హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. డ్రగ్స్ కేసు అదుపులోకి తీసుకున్న ఏలూరు ఎంపీ పుత్త మహేష్ యాదవ్‌కు పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఆయనతో పాటు పుట్టా మధు, ప్రియాంక రెడ్డికి కూడా అధికారులు బెయిల్ ఇచ్చారు. రేపాటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంపీకి స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అవసరమైన న్యాయపరమైన ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాత వారిని విడుదల చేశారు.

You Might Also Like

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird