
తెలంగాణ బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని ప్రముఖ ఉదయ భాను కలిశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉదయ భాను తెలంగాణలో బలహీన వర్గానికి చెందిన అణగారిన మహిళల భవిష్యత్తు గురించి ప్రభాకర్ తో చర్చించారు. సినిమా రంగంలో, రంగంలో మహిళలకు అవకాశాలు కలిపించాలని. అంతేగాక వారికి వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విన్నవించారు.
తన లాగే ఉదయ భాను మహిళలపై చూపిస్తున్న ప్రేమకి, వారికి మంచి చేయాలనే ఆమె ప్రయత్నానికి ఆకర్షితులయ్యారు. ఉదయ్ భాను ఆలోచనలని, తన అభిప్రాయాలను మెచ్చుకున్నారు. తప్పకుండా తాను అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.
ఇప్పటికే ఎంతోమందికి ప్రభుత్వం తరుపున ఇంకా స్వంతంగా ఎన్నో ప్రయోజనాలు అందించిన ఆయన, ఇక నుంచి మరింత ఉంటానని చెప్పారు. మహిళల పట్ల ఉదయ భానకున్న ప్రేమపై ప్రశంసలు కురిపించారు. భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆమెతో చర్చించారు.
తెలంగాణలో వెనుకబడిన, అణగారిన మహిళల శ్రేయస్సు, సాధికారతపై వారి చర్చ సాగింది. ముఖ్యంగా తదుపరి తరం మహిళలకు ఆత్మవిశ్వాసంతో, అవకాశాలతో, గౌరవంతో ఎదగడానికి మరింత బలమైన మార్గాలను ఎలా సృష్టించవచ్చో అనే దానిపై ఉదయ భాను సుధీర్గంగా చర్చించారు.
అణగారిన మహిళల కోసం ముందుకు వచ్చి, వారి సంక్షేమం కోసం ఉదయ భాను చేస్తున్న ప్రయత్నం అభినందనీయంగా మారింది.

C.E.O
Cell – 9866017966

