
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు మరియు నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు దేవాన్ష్కు సంప్రదాయబద్ధంగా నూతన వస్త్ర బహుకరణ (ధోతీ) వేడుకను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. నారా, నందమూరి కుటుంబ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడంలో ముందుంటాయని ఈ వేడుక మరోసారి ప్రతిబింబించింది.హైదరాబాద్లోని వారి నివాసంలో కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధుమిత్రుల సమక్షంలో దేవాన్ష్కు ధోతీ వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సంప్రదాయాల్లో వేద మంత్రాల మధ్య పెద్దలు ఆశీర్వదిస్తూ దేవాన్ష్కు నూతన వస్త్రాలు బహుకరించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాల మధ్య వేడుకలు నిర్వహించారు. తాతల మురిపెం, అమ్మమ్మ–నాన్నమ్మల ఆశీస్సులు, తల్లిదండ్రుల ప్రేమాభిమానాలు, మేనమామల ఆత్మీయత మధ్య దేవాన్ష్ ఈ ప్రత్యేక వేడుకల్లో పాల్గొంటారు.
చిన్న వయసులోనే కుటుంబ సంప్రదాయాలను కొనసాగిస్తూ దేవాన్ష్కు నూతన వస్త్రాలను అందించడం ఆనందంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ వేడుకలో బంధుమిత్రులు దేష్కు ఆశీస్సులు అందిస్తూ ఆయన సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తుతో ఆనందమయ జీవితం గడపాలని ఆకాంక్షించారు. సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇచ్చే నారా–నందమూరి కుటుంబం మరోసారి తమ సంస్కృతి పట్ల ఉన్న గౌరవాన్ని ఈ కార్యక్రమం ద్వారా చాటిచెప్పారు.

C.E.O
Cell – 9866017966




